BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్
Date of Publish : 07 August 2026, 02:08 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

చాట్రాయిలో మృతుడి కుటుంబానికి సహకార సంఘం ఆర్థిక సాయం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Aug, 2026 - 02:08 PM
107 వీక్షణలు

చాట్రాయిలో మృతుడి కుటుంబానికి సహకార సంఘం ఆర్థిక సాయం

చాట్రాయి: ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చాట్రాయి సహకార సంఘం అప్పుదారుడు బుర్రి రమేష్ ఇటీవల మృతి చెందడంతో, ఆయన కుటుంబానికి మట్టి ఖర్చుల నిమిత్తం సహకార సంఘం తరఫున రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు.

సంఘ ఛైర్పర్సన్ తుమ్మల రామ్మోహనరావు స్వయంగా బుర్రి రమేష్ కుటుంబ సభ్యురాలు బుర్రి పండుకు రూ.10,000 నగదును అందించారు. ఈ సందర్భంగా రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత మందపాటి బసవా రెడ్డి, సంఘ డైరెక్టర్లు కాలసాని సత్యనారాయణ, ఓరుగంటి రామారావు, రాజేష్, సంజీవరెడ్డి, జనసేన నాయకుడు తుమ్మల కరుణాకర్‌తో పాటు సహకార సంఘం సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మందపాటి బసవా రెడ్డి మాట్లాడుతూ.. సహకార సంఘం ద్వారా సభ్యులకు రుణ సదుపాయాలతో పాటు ఆపద సమయంలో కుటుంబాలకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. బుర్రి రమేష్ కుటుంబానికి సంఘం తరఫున అందించిన ఆర్థిక సహాయం కొంతమేరకు ఉపశమనం కలిగిస్తుందని పేర్కొన్నారు. కుటుంబానికి అవసరమైన సమయంలో తమ వంతు సహకారం అందించేందుకు ముందుంటామని తెలిపారు.