ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట– అద్దమడుగు బైస్ రాజేష్ పైలెట్
NTODAY NEWS: బొమ్మలరామారం
ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తుందని భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బైసు రాజేష్ పైలెట్ అన్నారు.శుక్రవారం రోజున మండలంలోని పిల్లిగుండ్ల తండా, మర్యాల, చౌదర్పల్లి, జలాల్పూర్, రామలింగంపల్లి,బొమ్మలరామారం, హాజీపూర్,నాగినేనిపల్లి, మైలారంలో ఇందిరమ్మ క్రాంతి పథకంలో భాగంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ను ప్రారంభించారు అనంతరం వైస్ చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంఘాల పెద్దపీట వేస్తూ వారికి ప్రోత్సాహంగా ధాన్యం కొలుగోలు సెంటర్ ను వారి చేతుల మీదుగా కొనుగోలు చేయాలని ఉద్దేశంతో ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆదేశానుసారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు రైతు దగ్గర పండించిన ప్రతి గింజ కొంటామని హామీ ఇచ్చారు సన్న వోడ్లకు కూడా బోనస్ వెంటనే ఇస్తున్నామని ఆయన అన్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు సెంటర్లకు హమాలీ కొరత లేకుండా చూస్తామని అన్నారు ప్రతి సెంటర్లకు తాడిపత్రిలు గన్ని బ్యాగులు వేయింగ్ మిషన్లు సరిపడా ఇచ్చామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భువనగిరి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు దేశెట్టి చంద్రశేఖర్, దిరావత్ శీను నాయక్,మండల కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ధీరావత్ సునీత, పిఎసిఎస్ డైరెక్టర్లు మోకు మధుసూదన్ రెడ్డి,మర్రి ఆగం రెడ్డి, మండల సీనియర్ నాయకులు రామిడి జంగారెడ్డి,మోటె గట్టయ్య,మన్నే నరేందర్ రెడ్డి, మేకల శ్రీశైలం,బుడుమ శ్రీశైలం,ఫకీర్ శ్రీకాంత్ రెడ్డి, బొమ్మలరామారం కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సాదుల ప్రవీణ్,రాంపల్లి కిరణ్ గౌడ్,ఏపీఎం చంచల యాదగిరి,ఏఈఓ లు కావ్య,మౌనిక,రైతులు,సహకార సంఘాల మహిళలు, తదితరులు పాల్గొన్నారు.

