www.ntodaynews.com
పథకం ప్రకారం హత్యకు కుట్ర
తెలంగాణ
పథకం ప్రకారం హత్యకు కుట్ర
NTODAY NEWS: బొమ్మలరామారం, యాదాద్రి భువనగిరి జిల్లా
ఎనిమిది మంది అరెస్ట్, ఒకరు పరారీలో
బొమ్మలరామారం, ఫిబ్రవరి 27: ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంతో ఓ యువకుడిపై పథకం ప్రకారం హత్యాయత్నానికి పాల్పడిన ఘటన బొమ్మలరామారం మండలంలో చోటుచేసుకుంది. ఈ విషయాన్ని బొమ్మలరామారం ఎస్‌ఐ బుగ్గ శ్రీశైలం వెల్లడించారు.
హైదరాబాద్ నేరేడ్‌మెట్‌కు చెందిన సాటల అజయ్ కుమార్, యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం రామలింగంపల్లి గ్రామానికి చెందిన యువతితో మూడు రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అనంతరం యువతి బంధువులు ఆమెను సర్దిచెప్పి ఫిబ్రవరి 24న రాత్రి రామలింగంపల్లికి తీసుకువచ్చినట్లు సమాచారం.
ఆ తర్వాత యువతి ఫోన్ ద్వారా అజయ్ కుమార్‌ను రామలింగంపల్లికి రమ్మని పిలిపించి, రామలింగేశ్వర ఫంక్షన్ హాల్ సమీపంలో అతనిపై దాడికి పాల్పడ్డారు. ముందుగా కళ్లలో కారం చల్లి, అనంతరం కత్తితో ఛాతి, ముఖం, వీపు, పక్కటెముకలు, చేతులపై దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించారు.
బాధితుడి బంధువు ఫిర్యాదు మేరకు బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌లో Cr.No. 47/2026గా కేసు నమోదు చేసి, భారతీయ న్యాయసంహిత (BNS) సెక్షన్లు 62, 109, 191 r/w 190 కింద విచారణ ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించగా, మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
#Bommalramaram #AttemptToMurder #LoveMarriageIssue #YadadriBhuvanagiri #CrimeNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube