BREAKING
thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రొంపిచర్లలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం 25వ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం thumb ● మునుగోడు ప్రజల తాగు, సాగునీటి అవసరాలపై రాజీపడేది లేదు thumb ● చౌడేపల్లిలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి
Date of Publish : 11 October 2026, 06:38 pm
Posted by : V శ్రీనివాస్

రూ.30 కోట్లతో ఆధునిక ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
11 Oct, 2026 - 06:38 PM
3 వీక్షణలు

పుష్కరాల నాటికి శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణం పూర్తి లక్ష్యం

మంచిర్యాల నియోజకవర్గాన్ని విద్య, వైద్య రంగాల హబ్‌గా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు

మంచిర్యాల: మంచిర్యాల నియోజకవర్గాన్ని విద్య, వైద్య రంగాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు తెలిపారు. ఆదివారం కాలేజ్ రోడ్డులోని పద్మనాయక ఏసీ ఫంక్షన్ హాల్‌లో ఆధునిక ఆర్టీసీ బస్టాండ్, పురాతన శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ నమూనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించారు.

18 ప్లాట్‌ఫామ్‌లతో ఆధునిక బస్టాండ్

సుమారు రూ.30 కోట్లతో మంచిర్యాలలో ఆధునిక సౌకర్యాలతో ఆర్టీసీ బస్టాండ్‌ను నిర్మించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 9 ప్లాట్‌ఫామ్‌ల స్థానంలో 18 ప్లాట్‌ఫామ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం విశ్రాంతి గదులు, మినీ థియేటర్, షాపింగ్ మాల్ తదితర సదుపాయాలు కల్పించేలా ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.

పుష్కరాల నాటికి విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణం

భక్తుల మనోభావాలకు అనుగుణంగా, దేవాదాయ శాఖ స్థపతి సూచనల మేరకు పురాతన శ్రీ విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు ప్రేమ్‌సాగర్ రావు తెలిపారు. రాబోయే పుష్కరాల నాటికి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

సింగరేణి కార్మికుల ఆదాయపు పన్ను మినహాయింపుపై చర్చ

సింగరేణి సంస్థలో అధికారులకు యాజమాన్యం ఆదాయపు పన్ను భరిస్తున్న విధంగానే కార్మికులకు కూడా పన్ను మినహాయింపు కల్పించాలని కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.

అలాగే సింగరేణి కార్మికుల మెడికల్ బోర్డులను కొత్తగూడెంలోనే కాకుండా ఏరియాల వారీగా నిర్వహించి, అదే రోజు ఫలితాలు వెల్లడించే విధానం అమలు చేయాలని సూచించారు. దీనివల్ల ప్రక్రియలో పారదర్శకత పెరిగి, అవినీతికి ఆస్కారం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య–మహేష్, జిల్లా ఆర్టీఏ సభ్యుడు అంకతి శ్రీనివాస్, కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు రామగిరి బానేష్, అక్కల వెంకటేశ్వర్లు, జిల్లా ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు పూదరి తిరుపతి, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి గుండ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, వివిధ విభాగాల నాయకులు, మహిళా నేతలు, యువజన కాంగ్రెస్ ప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు.