BREAKING
thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా
Date of Publish : 11 October 2026, 11:44 am
Posted by : PABBINEEDI B SANKAR

16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ..

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
Pabbineedi B Sankar Tellapur Mandal
11 Oct, 2026 - 11:44 AM
5 వీక్షణలు

మున్సిపల్ సిబ్బంది, ఆటో డ్రైవర్ల కుటుంబాలతో పండుగ సంతోషాలు

తెల్లాపూర్: బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకుని తెల్లాపూర్ మున్సిపల్ సిబ్బంది, ఆటో డ్రైవర్ల కుటుంబాలకు మాజీ మున్సిపల్ చైర్మన్ లలిత సోమిరెడ్డి, మాజీ సర్పంచ్ సోమిరెడ్డి పండుగ కానుకలు అందజేశారు. గత 16 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తూ కార్మికులు, ఆటో డ్రైవర్ల కుటుంబాలతో పండుగ సంతోషాలను పంచుకుంటున్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బంది, ఆటో డ్రైవర్ల కుటుంబ సభ్యులకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పండుగలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని, కుటుంబాలన్నీ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న మున్సిపల్ సిబ్బంది, ఆటో డ్రైవర్ల సేవలను గుర్తిస్తూ వారితో పండుగ వేడుకలను పంచుకోవడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. వరుసగా 16 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం ద్వారా వారితో అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా పండుగ కానుకలు అందుకోవడంతో మున్సిపల్ సిబ్బంది, ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో ఆనందం వ్యక్తమైంది.