BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 12:01 pm
Posted by : SEETHA KIRAN KUMAR

ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాల్సిన చోటే రైతు మృతి

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
25 Nov, 2026 - 12:01 PM
11 వీక్షణలు

ధాన్యం ఆరబోస్తూ, రాత్రి కుప్ప చేస్తున్న సమయంలో గుండెపోటు

కొనుగోలు కేంద్రం ఏర్పాటులో జాప్యంపై గ్రామస్థుల ఆగ్రహం

పర్వతగిరి, నవంబర్ 25, ఎన్ టుడే న్యూస్:

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం బూరుగుమడ్ల గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాల్సిన స్థలంలోనే నాళ్లం వీరస్వామి (60) అనే రైతు గుండెపోటుతో మృతి చెందారు. పండించిన పంటను విక్రయించేందుకు సిద్ధం చేసుకుంటున్న సమయంలో ఈ ఘటన జరగడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

స్థానికుల సమాచారం ప్రకారం.. వీరస్వామి గత మూడు రోజులుగా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాల్సిన ప్రదేశంలో ఆరబోస్తున్నారు. రాత్రివేళ ధాన్యాన్ని కుప్ప చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, గ్రామంలో వరి కోతలు ప్రారంభమై సుమారు 15 రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోవడంపై రైతులు, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభంలో జాప్యం కారణంగా రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం, నిల్వ చేసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొంటున్నారు.

కొనుగోలు కేంద్రం ఏర్పాటు ఆలస్యమే రైతు మృతికి కారణమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. అయితే వీరస్వామి మృతికి గుండెపోటు కారణమని ప్రాథమిక సమాచారం మాత్రమే అందుబాటులో ఉంది. కొనుగోలు కేంద్రం ఏర్పాటులో జాప్యంపై సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.