BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 09:11 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో నవ్వుల పువ్వులు.. దత్తత చర్చతో సందడి

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 09:11 AM
25 వీక్షణలు

మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి సరదా సమాధానం.. రేవంత్ రెడ్డి చమత్కారంతో సభలో నవ్వులే నవ్వులు

హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కార్యవర్గ సమావేశం రాజకీయ చర్చలతో పాటు సరదా సంభాషణలతోనూ ఆహ్లాదకరంగా సాగింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన సమాధానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన చమత్కారంతో సమావేశంలో నవ్వులు విరిశాయి.

సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ కాదని స్పష్టం చేశారు. తనకు గానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గానీ రాజకీయ వారసులు లేరని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని, ఆయన పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారని అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిల్లలు లేరని, రాజకీయాల్లోకి వచ్చే వారసులు కూడా ఎవరూ లేరని సరదాగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తనను దత్తత తీసుకుంటే వెళ్లిపోతానంటూ చమత్కరించారు.

దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ తనకు ఉన్న అప్పులకు కూడా దత్తత రావాల్సి ఉంటుందని సరదాగా బదులిచ్చారు. వెంటనే మహేష్ కుమార్ గౌడ్ స్పందిస్తూ ఉత్తమ్ అన్న అప్పులను కూడా దత్తత తీసుకుంటానంటూ వ్యాఖ్యానించారు. దీంతో సమావేశ మందిరం నవ్వులతో మార్మోగింది.

ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ సరదా సంభాషణలో కలిశారు. రోహిన్ రెడ్డి కూడా దత్తత కోసం చూస్తున్నారని, సంపత్ కుమార్ సైతం అదే ప్రయత్నంలో ఉన్నారని చమత్కరించడంతో నేతలంతా నవ్వుకున్నారు. రాజకీయ అంశాలపై చర్చల మధ్య సాగిన ఈ సరదా సంభాషణ టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.