చిట్యాలలో గంట స్వరూప దేవి జన్మదిన వేడుకలు
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
/
చిట్యాల
చిట్యాల: ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌరవ శ్రీమతి గంట స్వరూప దేవి గారి జన్మదిన వేడుకలను చిట్యాల హాస్పిటల్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా స్వరూప దేవి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేశారు. అనంతరం చిట్యాల హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులకు పండ్లు పంపిణీ చేశారు.
జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో నిర్వహించడం అభినందనీయమని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు చేపట్టడం స్ఫూర్తిదాయకమని తెలిపారు.