BREAKING
thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా thumb ● కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి thumb ● ఆబ్కారి సీఐ జయశ్రీకి మోకుదెబ్బ సంఘం ఆధ్వర్యంలో సన్మానం thumb ● అయ్యప్ప స్వాములకు 41 రోజుల పాటు అన్నదానం thumb ● తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం thumb ● వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి.. 5 దరఖాస్తుల స్వీకరణ thumb ● బీఆర్‌ఎస్ నాంపల్లి మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడిగా నక్క చంద్రశేఖర్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా thumb ● కాంగ్రెస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం thumb ● అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తాం thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి
Test 4
Date of Publish : 16 November 2026, 06:58 pm
Posted by : K MAHESH

ఉద్యోగుల భవిష్యత్తుకు పాత పెన్షనే భరోసా

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
16 Nov, 2026 - 06:58 PM
17 వీక్షణలు

నవంబర్ 17న సామూహిక సెలవు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

బయ్యారం, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్): కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (ఓపీఎస్) పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగుల సంఘం బయ్యారం మండల అధ్యక్షుడు భానోత్ రవీందర్ నాయక్, ప్రధాన కార్యదర్శి గలిగి దస్తగిరి డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌తో నవంబర్ 17న నిర్వహించనున్న సామూహిక సెలవు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

ఎన్నికల సమయంలో పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు వారు తెలిపారు. ఉద్యోగుల భవిష్యత్తు భద్రతకు పాత పెన్షన్ విధానం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో నవంబర్ 17న మహబూబాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించే నిరసన కార్యక్రమంలో బయ్యారం మండలానికి చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తావు, మోహన్, సురేష్ రెడ్డి, శ్రీకాంత్ నాయక్, కొలిపాక శ్రీనివాస్, సరిత తదితరులు పాల్గొన్నారు.