BREAKING
thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు
Test 4
Date of Publish : 16 November 2026, 04:28 pm
Posted by : K MAHESH

ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి

తెలంగాణ
/ సూర్యాపేట / సూర్యాపేట
Reporter
K Mahesh Munugodu Constituency
16 Nov, 2026 - 04:28 PM
10 వీక్షణలు

ప్లగ్ బోర్డులో దెబ్బతిన్న ఇన్సులేషన్‌.. ఇద్దరు కుమారులకు తల్లిని దూరం చేసిన ప్రమాదం

సూర్యాపేట, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్):

మొబైల్ ఫోన్‌కు ఛార్జింగ్ పెడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. ఇంట్లోని ప్లగ్ బోర్డులో విద్యుత్ వైర్లు బయటకు కనిపిస్తున్న విషయాన్ని గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన ఎర్రగొర్ల ఉపేంద్ర (44) ఇంట్లో మొబైల్ ఫోన్‌కు ఛార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ప్లగ్ బోర్డులో ఇన్సులేషన్ దెబ్బతిని వైర్లు బయటకు కనిపిస్తున్నాయి. అయితే వాటిని గమనించకుండా ఛార్జర్ పెట్టే సమయంలో ఆమె చేతికి విద్యుత్ వైర్లు తగలడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురయ్యారు. దీంతో ఉపేంద్ర అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.

మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తల్లి ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఈ ఘటన నేపథ్యంలో ఇంట్లో దెబ్బతిన్న ప్లగ్ బోర్డులు, బయటకు కనిపించే విద్యుత్ వైర్లు, పాడైన స్విచ్‌లను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే మరమ్మతులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మొబైల్ ఛార్జింగ్ సమయంలో విద్యుత్ భద్రతా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.