BREAKING
thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు
Test 4
Date of Publish : 16 November 2026, 04:31 pm
Posted by : PAGADALA DEVAIAH

అమరవీరుల స్ఫూర్తితో సమసమాజ స్థాపనకు, శాస్త్రీయ విద్య కోసం విద్యార్థులు పోరాడాలి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
16 Nov, 2026 - 04:31 PM
7 వీక్షణలు

జంపాల చంద్రశేఖర ప్రసాద్, శ్రీపాద శ్రీహరి 50వ వర్ధంతి సభలో PDSU నేతల పిలుపు

హైదరాబాద్, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్): జంపాల చంద్రశేఖర ప్రసాద్, శ్రీపాద శ్రీహరి అమరత్వ స్ఫూర్తితో సమసమాజ స్థాపన, శాస్త్రీయ విద్యా సాధన కోసం నేటి విద్యార్థులు ఉద్యమించాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) నాయకులు పిలుపునిచ్చారు. విద్యారంగ సమస్యలపై పోరాటాలతో పాటు సమాజంలోని అసమానతలు, దోపిడీ, వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థులు చైతన్యంతో ముందుకు సాగాలని సూచించారు.

PDSU తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ఈసీజీ ఆడిటోరియంలో జంపాల చంద్రశేఖర ప్రసాద్, శ్రీపాద శ్రీహరి 50వ వర్ధంతి సభ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు పి. మహేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు అమరవీరుల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం సభలో పాల్గొన్నవారు మౌనం పాటించి అమరవీరులకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జంపాల చంద్రశేఖర ప్రసాద్ మిత్రుడు, ప్రొఫెసర్ ఏ. వినయ్ బాబు మాట్లాడుతూ.. వియత్నాం విప్లవ పోరాటాలు, నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరి లోయ ఉద్యమాలు, చేగువేరా, భగత్ సింగ్ వంటి యోధుల త్యాగాలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విప్లవ చైతన్యానికి ప్రేరణగా నిలిచాయని అన్నారు. జార్జిరెడ్డి హత్య అనంతరం ఆయన ఆశయాలను ఉద్యమ కాగడాగా ముందుకు తీసుకెళ్లిన జంపాల చంద్రశేఖర ప్రసాద్, ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) నిర్మాణానికి కృషి చేశారని వివరించారు.

ఎమర్జెన్సీ కాలంలో విప్లవోద్యమ నాయకుడు నీలం రామచంద్రయ్యతో కలిసి విజయవాడలో అరెస్టయిన జంపాల చంద్రశేఖర ప్రసాద్‌ను 1975 నవంబర్ 5న ఇల్లందు అటవీ ప్రాంతంలో కాల్చి చంపారని వినయ్ బాబు పేర్కొన్నారు. మరో విద్యార్థి ఉద్యమ నాయకుడు శ్రీపాద శ్రీహరి, పోట్ల రామచంద్రయ్యతో కలిసి మలక్‌పేటలో అరెస్టయి 1976 నవంబర్ 3న పోలీసు కాల్పుల్లో మరణించారని తెలిపారు.

కోలా శంకర్, చేరాలు, రమణయ్య, రంగవల్లి, స్నేహలత, మారోజు వీరన్న, యానాల వీరారెడ్డి తదితరులు కూడా ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేశారని గుర్తుచేశారు. వారి త్యాగాల స్ఫూర్తితో శాస్త్రీయ విద్యా సాధన, సమసమాజ స్థాపన, నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యాల కోసం విద్యార్థులు పోరాటాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. విప్లవ విద్యార్థి అమరవీరుల చరిత్ర PDSU ఉద్యమానికి ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తుందని అన్నారు.

జార్జిరెడ్డి మిత్రులు, PDSU పూర్వ రాష్ట్ర అధ్యక్షులు బి. ప్రదీప్, సాదినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. PDSU కేవలం విద్యారంగ సమస్యల పరిష్కారానికే పరిమితం కాకుండా కార్మిక, కర్షక, యువజన, మహిళా, ప్రజాస్వామిక ఉద్యమాలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. రైల్వే కార్మికుల పోరాటం, రమీజాబీ ఘటన, దివిసీమ ఉప్పెన, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, లగచర్ల రైతాంగ పోరాటాలకు మద్దతుగా నిలిచిందని వివరించారు. తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన సంఘం ప్రస్తుతం దేశంలోని అనేక రాష్ట్రాల్లో విస్తరించి విద్యార్థుల సమస్యలపై పోరాడుతోందని తెలిపారు.

విద్యార్థి ఉద్యమం అంటే క్యాంపస్ సమస్యల పరిష్కారానికే పరిమితమైనది కాదని, సమాజంలోని అన్యాయాలు, అసమానతలు, దోపిడీ, వివక్షకు వ్యతిరేకంగా సాగాల్సిన సామాజిక మార్పు ఉద్యమమని వారు అభిప్రాయపడ్డారు. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించడం, హక్కుల కోసం పోరాడే చైతన్యాన్ని కల్పించడం, సామాజిక మార్పు కోసం వారిని భాగస్వాములను చేయడం PDSU ఉద్యమ ప్రస్థానంలో భాగమని అన్నారు.

2024–2026 మధ్య బంగ్లాదేశ్, కెన్యా, సెర్బియా తదితర దేశాల్లో విద్యార్థులు, యువత చేపట్టిన ఉద్యమాలను ప్రస్తావిస్తూ.. ప్రజా సమస్యలపై యువత పోరాటాలు సామాజిక, రాజకీయ మార్పులకు దోహదపడుతున్నాయని పేర్కొన్నారు.

నేటి విద్యార్థులు నూతన జాతీయ విద్యా విధానం–2020, కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలు, రాజ్యాంగబద్ధ సంస్థల వినియోగం వంటి అంశాలపై ప్రశ్నించాలని నాయకులు కోరారు. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, విద్యా-ఉపాధి అవకాశాల మెరుగుదల, సమాజ మార్పు కోసం జరిగే ఉద్యమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణలో విద్యారంగ పరిస్థితిపై వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత, ఇంటర్మీడియట్ విద్య విలీనం, పాలిటెక్నిక్ విద్య ప్రైవేటీకరణ ప్రయత్నాలు, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు, ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో నిధుల కొరత, ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర పోస్టుల భర్తీ లేకపోవడం వంటి అంశాలు విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయని ఆరోపించారు. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ విద్యాసంస్థలకు నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యారంగానికి ప్రత్యేక మంత్రి లేకపోవడం వల్ల సమస్యలను ఎవరికి తెలియజేయాలో విద్యార్థులకు అర్థంకాని పరిస్థితి నెలకొందని వారు విమర్శించారు. విద్యారంగ బలోపేతానికి స్పష్టమైన విధానాలు ప్రకటించి, ప్రభుత్వ విద్యాసంస్థలను పరిరక్షించాలని కోరారు.

అమరవీరులు కన్న కలల సాధన కోసం, వారు చూపిన పోరాట మార్గంలో నేటి విద్యార్థులు ముందుకు సాగడమే వారికి అందించే నిజమైన నివాళి అని నాయకులు పేర్కొన్నారు. జంపాల చంద్రశేఖర ప్రసాద్, శ్రీపాద శ్రీహరి వంటి అమరవీరుల త్యాగాలు విద్యార్థి ఉద్యమాలకు ఎప్పటికీ దిశానిర్దేశం చేస్తాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు బోనగిరి మధు, జన్నారపు రాజేశ్వర్, డి. శ్రీకాంత్, కే. రాణా ప్రతాప్, కే. శ్రీనివాస్, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఆర్. గౌతమ్ కుమార్, జి. మస్తాన్, మంద నవీన్, రాష్ట్ర నాయకులు తీగల శ్యామ్, కే. ఝాన్సీ, జి. గౌతమ్, పుల్లూరి సింహాద్రి, రెడ్డి చరణ్, మర్రి మహేష్, శ్రీకాంత్, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎస్.కె. ఆసిఫ్, మౌనిక, జిల్లా కోశాధికారి రహీం, మాధవ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.