BREAKING
thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు
Test 4
Date of Publish : 16 November 2026, 03:35 pm
Posted by : K MAHESH

గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
16 Nov, 2026 - 03:35 PM
9 వీక్షణలు

సోషల్ మీడియా, ఆన్‌లైన్ గేమ్స్‌, బెట్టింగ్ యాప్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యార్థులకు సూచన

మహబూబాబాద్, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్):

బాలల హక్కుల వారోత్సవాలను పురస్కరించుకుని మహబూబాబాద్ జిల్లాకు చెందిన సేవా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఆటోనగర్ సమీపంలోని గేమ్ పాయింట్‌లో పాఠశాల స్థాయి విద్యార్థులకు బాలల హక్కులు, వ్యక్తిగత భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా బ్యాడ్మింటన్ శిక్షణ పొందుతున్న విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ ప్రధాన కార్యదర్శి అయిత ఉషాభాస్కర్ తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన గోడ ప్రతులను బ్యాడ్మింటన్ కోచ్ బండి పూజ ఆవిష్కరించి విద్యార్థులకు అందజేశారు.

ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు జూపాక రత్న ప్రణయ్, అయిత ఉషాభాస్కర్ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వినియోగం పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు ఆన్‌లైన్ గేమ్స్‌, బెట్టింగ్ యాప్‌లకు దూరంగా ఉండాలని తెలిపారు.

అపరిచిత వ్యక్తులు, అనుమానాస్పదంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా ఇబ్బందులకు గురిచేసినా లేదా ఏదైనా సమస్య ఎదురైనా భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని విద్యార్థులకు వివరించారు.

ఈ కార్యక్రమంలో సంస్థ కోశాధికారి దూలం సందీప్‌తో పాటు సభ్యులు కోమల్ దీక్షంద్ర, వాసం రాజేష్, శ్రీనివాస్, నాగరాజు, ప్రపుల్, భరత్, అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.