BREAKING
thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు
Test 4
Date of Publish : 16 November 2026, 03:37 pm
Posted by : K MAHESH

కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి

తెలంగాణ
/ మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
16 Nov, 2026 - 03:37 PM
8 వీక్షణలు

శిథిలావస్థకు చేరిన పాత భవనం.. ప్రజావాణిలో అదనపు కలెక్టర్‌కు తల్లిదండ్రుల వినతి

మహబూబాబాద్, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్):

మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు మంజూరు చేసి నిర్మించాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

గత 60 సంవత్సరాలకు పైగా విద్యాసేవలు అందిస్తున్న కంబాలపల్లి ప్రాథమిక పాఠశాల భవనం ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని తల్లిదండ్రులు తెలిపారు. భవనంలోని నాలుగు తరగతి గదులు నిరుపయోగంగా మారడంతో విద్యాబోధనకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. శిథిలమైన భవనం విద్యార్థుల భద్రతకు ముప్పుగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల భవిష్యత్తు, భద్రతను దృష్టిలో ఉంచుకుని నిరుపయోగంగా ఉన్న పాత నాలుగు గదుల భవనాన్ని తొలగించి, అదే ప్రదేశంలో నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలని కోరారు. ఇందుకోసం తక్షణమే నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని ఈ సందర్భంగా తల్లిదండ్రులు కోరారు.

ఈ కార్యక్రమంలో పిట్టల లక్ష్మణ్, చిక్కుల సరోజన, కె. సత్యనారాయణ, బాదె సహాదేవ్, ఏర్న వేణు, అచ్చ ప్రశాంత్, టీపీ జేఏసీ బాధ్యులు మైస శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.