BREAKING
thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు
Test 4
Date of Publish : 16 November 2026, 04:42 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
16 Nov, 2026 - 04:42 PM
17 వీక్షణలు

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

​ధర్మపురిలో 165 మందికి నూతన 'చేయూత' పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

​గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులకు నిధులు మంజూరు: మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి

​ధర్మపురి, నవంబర్ 16:

అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలను అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం ధర్మపురి పురపాలక సంఘం కార్యాలయం వద్ద నూతనంగా మంజూరైన 'చేయూత' సామాజిక భద్రత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ధర్మపురి మున్సిపాలిటీ పరిధిలోని 15 వార్డులకు చెందిన 165 మంది నూతన లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు.

​పేదల సంక్షేమానికి పెద్దపీట: మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ.. గత పదేళ్ల పాలనలో అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులందరికీ రేషన్ కార్డులు అందించడమే కాకుండా సన్నబియ్యం పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల వంటి ప్రతిష్టాత్మక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. సామాజిక భద్రతకు ప్రాధాన్యతనిస్తూ వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు చేయూత పింఛన్లు అందించడం అభినందనీయమన్నారు.

​గోదావరి పుష్కరాల పనులకు శ్రీకారం:

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక చొరవ, సహకారంతో ధర్మపురి పట్టణంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని చైర్‌పర్సన్ వివరించారు. ముఖ్యంగా 2027లో జరగనున్న గోదావరి పుష్కరాల అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. మంత్రి సహకారంతో మరిన్ని నిధులు తీసుకువచ్చి ధర్మపురి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

​ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రసూనాంబ, డీఆర్డీఏ పీడీ రఘువరన్, మున్సిపల్ వైస్ చైర్మన్ రామన్న, కౌన్సిలర్లు, అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.