BREAKING
thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు
Test 4
Date of Publish : 16 November 2026, 04:14 pm
Posted by : K MAHESH

TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు

తెలంగాణ
/ మహబూబాబాద్ / తొర్రూర్
Reporter
K Mahesh Munugodu Constituency
16 Nov, 2026 - 04:14 PM
9 వీక్షణలు

ఉద్యోగులు, విద్యార్థులు, రోజువారీ ప్రయాణికులకు ఆర్థిక వెసులుబాటు.. సద్వినియోగం చేసుకోవాలని తొర్రూరు డిపో మేనేజర్ సూచన

తొర్రూరు, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్):

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికుల సౌకర్యార్థం మంత్లీ సీజన్ టికెట్ (MST) విధానంలో పలు మార్పులు, రాయితీలు, అదనపు ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సదుపాయాలను తొర్రూరు పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తొర్రూరు డిపో మేనేజర్ సూచించారు.

MST టికెట్ల ద్వారా ప్రయాణికులు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు సంస్థ పలు వెసులుబాట్లు కల్పించిందని తెలిపారు.

MST టికెట్లపై ముఖ్యమైన ప్రయోజనాలు:

  • దూర పరిమితి లేదు: పరిమితి లేకుండా ఎంత దూరానికైనా MST టికెట్ పొందే అవకాశం కల్పించారు.

  • టోల్ చార్జీల వెసులుబాటు: టోల్ చార్జీల పరిమితిని 25 రోజుల నుంచి 20 రోజులకు తగ్గించారు.

  • డీలక్స్ బస్సుల్లోనూ అవకాశం: ప్రస్తుతం డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే వారు కూడా MST టికెట్లు పొందవచ్చు.

  • ఆదివారం సిటీ బస్సుల్లో ప్రయాణం: MST టికెట్ కలిగిన వారు ఆదివారాల్లో హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ నగరాల్లో పుష్పక్ ఎయిర్‌పోర్ట్ బస్సులు మినహా అన్ని సిటీ బస్సుల్లో ప్రయాణించవచ్చు.

  • అదనపు చార్జీతో ఇతర సర్వీసుల్లో ప్రయాణం: పల్లెవెలుగు MST కలిగిన వారు అదనంగా రూ.20 చెల్లించి ఎక్స్‌ప్రెస్ లేదా ఈ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఎక్స్‌ప్రెస్ MST కలిగిన వారు రూ.20 అదనంగా చెల్లించి డీలక్స్ లేదా ఈ-డీలక్స్ బస్సుల్లో ప్రయాణించవచ్చు.

  • ఇతర రూట్లలో రాయితీ: తమ MST రూట్ కాకుండా ఇతర రూట్లలో సూపర్ లగ్జరీ, ఆపై స్థాయి బస్సు సర్వీసుల్లో 10 శాతం రాయితీ పొందవచ్చు.

  • రెండు నెలల MST: రెండు నెలల కాలపరిమితి గల టికెట్ తీసుకున్న వారికి అదనంగా ఐదు రోజుల ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు.

  • మూడు నెలల MST: మూడు నెలల కాలపరిమితి గల టికెట్ తీసుకున్న వారికి అదనంగా 10 రోజుల ప్రయాణ సౌకర్యం ఉంటుంది.

  • మహిళలకు ప్రత్యేక వెసులుబాటు: మహిళా ప్రయాణికులు కేవలం 15 రోజుల చార్జీలు చెల్లించి ఒక నెల కాలపరిమితి గల MST టికెట్ పొందవచ్చు.

ఈ సదుపాయాల వల్ల ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, మహిళలు, నిత్యం ప్రయాణించే వారికి ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుందని డిపో మేనేజర్ తెలిపారు. తొర్రూరు పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రయాణికులు ఈ అవకాశాలను వినియోగించుకుని TGSRTC మంత్లీ సీజన్ టికెట్ల ద్వారా ప్రయాణ ఖర్చులను తగ్గించుకోవాలని కోరారు.