BREAKING
thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు
Test 4
Date of Publish : 16 November 2026, 04:18 pm
Posted by : K MAHESH

వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
K Mahesh Munugodu Constituency
16 Nov, 2026 - 04:18 PM
8 వీక్షణలు

రోజుకు రూ.700 వేతనం ఇవ్వాలి.. మహబూబాబాద్‌ను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్

మహబూబాబాద్, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్):

మహబూబాబాద్ జిల్లాలో తక్కువ వర్షపాతం నమోదైన నేపథ్యంలో జిల్లాను కరువు ప్రాంతంగా గుర్తించాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం (AIPKSM) జిల్లా ప్రధాన కార్యదర్శి ముంజంపల్లి వీరన్న డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి 250 రోజుల పని కల్పించడంతో పాటు రోజుకు రూ.700 వేతనం చెల్లించాలని కోరారు.

సంఘం జిల్లా అధ్యక్షుడు ఉమ్మగాని సత్యం అధ్యక్షతన మహబూబాబాద్‌లోని మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వీరన్న మాట్లాడారు. జిల్లాలో తీవ్రమైన కరువు పరిస్థితులు నెలకొనడంతో వ్యవసాయ కూలీలకు ఉపాధి లేకుండా పోతోందని, జీవనోపాధి కోసం అనేక మంది ప్రజలు పట్టణాలకు వలస వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉపాధి హామీ కూలీలకు 250 రోజుల పని కల్పించి, రోజుకు రూ.700 వేతనం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వివిధ నిబంధనలు, కారణాలతో ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వ్యవసాయ కార్మికులు అర్థం చేసుకుని, తమ హక్కుల సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు నిధుల కోత విధిస్తూ కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధానాలను అనుసరిస్తోందని వీరన్న విమర్శించారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు నెలకు రూ.1,000 చొప్పున మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

బకాయిల చెల్లింపులో జాప్యం కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని హెచ్చరించారు.

ఈ సమావేశంలో సంఘం జిల్లా నాయకులు బూర్గుల మోష, చిత్తారి పాపయ్య, పెరుమాండ్ల జానకిరాములు, జి. శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కూలీల సమస్యలు, ఉపాధి హామీ పథకం అమలు, వేతనాల పెంపు తదితర అంశాలపై పలు తీర్మానాలను సమావేశం ఆమోదించింది.