BREAKING
thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు thumb ● ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతం.. మహిళ మృతి thumb ● వ్యవసాయ కార్మికులకు 250 రోజుల పని కల్పించాలి thumb ● ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే thumb ● TGSRTC ప్రయాణికులకు శుభవార్త.. MST టికెట్లపై ఆకర్షణీయమైన రాయితీలు thumb ● తొర్రూరులో 280 డబుల్ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభం thumb ● కంబాలపల్లి పాఠశాలకు నాలుగు నూతన తరగతి గదులు నిర్మించాలి thumb ● గేమ్ పాయింట్‌లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం thumb ● మహబూబాబాద్‌లో 1,220 మందికి నూతన చేయూత పింఛన్ల పంపిణీ thumb ● కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం thumb ● పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర తేదీలు ఖరారు
Test 4
Date of Publish : 16 November 2026, 04:17 pm
Posted by : K MAHESH

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాలు.. టాప్‌-10లో భారత నగరాలే

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
K Mahesh Munugodu Constituency
16 Nov, 2026 - 04:17 PM
10 వీక్షణలు

AQI.in గణాంకాల్లో గురుగ్రామ్‌కు అగ్రస్థానం.. 691 పాయింట్లతో తొలి ర్యాంకు

న్యూఢిల్లీ, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్):

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వాయు కాలుష్యం నమోదవుతున్న నగరాల జాబితాలో భారత నగరాలు ఆందోళనకర స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించాయి. నవంబర్ 16వ తేదీ ఉదయం 9:45 గంటలకు నమోదైన AQI.in గణాంకాల ప్రకారం ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల టాప్‌-10 జాబితాలో భారత్‌కు చెందిన నగరాలే చోటు దక్కించుకున్నాయి.

ఈ జాబితాలో హర్యానాలోని గురుగ్రామ్ 691 AQI పాయింట్లతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మొదటి స్థానంలో నిలిచింది. హర్యానాకే చెందిన హిసార్ 660 పాయింట్లతో రెండో స్థానంలో, భివానీ 640 పాయింట్లతో మూడో స్థానంలో, రోహ్‌తక్ 620 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీ 600 AQI పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.

ఇక సోనిపట్, నోయిడా, భటిండా, సిర్సా, ఫరీదాబాద్ నగరాలు కూడా అత్యంత కాలుష్య నగరాల టాప్‌-10 జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాల తొలి పది స్థానాల్లోనూ భారత నగరాలే ఉండటం పర్యావరణ పరిస్థితులపై ఆందోళన కలిగిస్తోంది.

పెరుగుతున్న వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, చిన్నారులు, వృద్ధులు కాలుష్య ప్రభావానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉండటంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.