BREAKING
thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప
Test 4
Date of Publish : 16 November 2026, 07:40 pm
Posted by : K MAHESH

తెలంగాణ మైనార్టీ పాఠశాలలో విద్యార్థినులకు హెచ్‌పీవీ టీకాల కార్యక్రమం

తెలంగాణ
/ వరంగల్
Reporter
K Mahesh Munugodu Constituency
16 Nov, 2026 - 07:40 PM
7 వీక్షణలు

వ్యాక్సినేషన్ శిబిరాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డీఎంహెచ్‌ఓ

నర్సంపేట, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్): భానోజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ కిరణ్ రాజు ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో హెచ్‌పీవీ (హ్యూమన్ పాపిల్లోమా వైరస్) వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వ్యాక్సినేషన్ శిబిరాన్ని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సందర్శించి తనిఖీ చేశారు. టీకాల కార్యక్రమం నిర్వహణ, సిబ్బంది విధులపై పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాల, జూనియర్ కళాశాల ఆవరణతో పాటు వంటగదిని ఆకస్మికంగా పరిశీలించారు.

పరిసరాల పరిశుభ్రత, వంటగదిలో పారిశుద్ధ్య పరిస్థితులను తనిఖీ చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వంట చేసే ప్రదేశంలో పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని, పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్‌కు సూచించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ కిరణ్ రాజు, డాక్టర్ శ్రవణ్ కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.