BREAKING
thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 16 November 2026, 08:25 pm
Posted by : K MAHESH

ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
16 Nov, 2026 - 08:25 PM
6 వీక్షణలు

నెల రోజులు దాటినా కొనుగోళ్లు ప్రారంభించలేదని ఆరోపణ

రామన్నపేట, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్):

రామన్నపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.

సోమవారం రామన్నపేట పట్టణంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. అనంతరం రైతులతో కలిసి మార్కెట్ యార్డులో నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి నెల రోజులు దాటినా ఇప్పటివరకు కనీసం ధాన్యం తేమ శాతాన్ని కూడా పరిశీలించడం లేదని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.

కొనుగోళ్లలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, సజావుగా నిర్వహించాలని సంబంధిత అధికారులను కోరారు.

ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం, ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్దాస్ విక్రమ్, మాజీ ఎంపీటీసీలు వేమవరం సుధీర్ బాబు, పున్న వెంకటేశం, ఎండీ ఆమీర్, జిల్లా నాయకులు బద్దుల రమేష్, ఎస్.కే. చాంద్, పట్టణ కార్యదర్శి జాడ సంతోష్, నాయకులు బత్తుల వెంకన్న, మిర్యాల మల్లేశం, బొడ్డు ఆహాల్లయ్య, నల్ల స్వామి, చొప్పరి నరసింహ, జెట్టి శివప్రసాద్, ఆవుల శ్రీధర్, చిన్నపాక రమేష్, బైకాని మహేష్, బుర్ర శ్రీశైలం, నక్క నరేందర్, రవ్వ నరసింహ, కోనూరు లింగస్వామి, ముక్కామల నరేందర్, బులుగుల కృష్ణ, లవణం ఉపేందర్, ఎండీ మోసబ్, బసాని రాజు, బొడ్డు శ్రీకాంత్, బాలగోని భరత్, గట్టు శేఖర్, వంగాల సాయి, గర్దాస్ శ్రీకాంత్, సాయి శంకర్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.