BREAKING
thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● చామల రంగనాయకమ్మకు రామన్నపేట కాంగ్రెస్ నేతల నివాళులు thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
Test 4
Date of Publish : 16 November 2026, 08:23 pm
Posted by : K MAHESH

పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
16 Nov, 2026 - 08:23 PM
5 వీక్షణలు

ఇద్దరు నిందితులపై కేసు నమోదు.. ఒకరిని అరెస్టు చేసిన రామన్నపేట పోలీసులు

రామన్నపేట, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్):

పోలీస్ అధికారిగా పరిచయం చేసుకుని ఓ వ్యక్తిని నమ్మించి రూ.55 వేల నగదును ఆన్‌లైన్‌లో మోసం చేసిన ఘటన రామన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఒకరిని అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 14న ఉదయం సుమారు 10 గంటలకు బాధితుడు గంత్ల రవీందర్ రెడ్డికి తాకూరి మల్లేష్, శ్రీనివాస్ రావు అనే వ్యక్తి 8790875631 నంబర్ నుంచి ఫోన్ చేశాడు. తాను రామన్నపేట పోలీస్ స్టేషన్ సబ్‌ఇన్‌స్పెక్టర్‌నని పరిచయం చేసుకుని బాధితుడి నమ్మకాన్ని పొందాడు.

డబ్బులు తీసుకురావడానికి పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్‌ను పంపిస్తానని, ముందుగా ఫోన్‌పే ద్వారా రూ.55 వేలు పంపిస్తే ఆ మొత్తాన్ని డ్రైవర్ ద్వారా నగదు రూపంలో తిరిగి అందజేస్తానని నమ్మబలికాడు. దీంతో బాధితుడు నిందితుడి మాటలు నమ్మి వివిధ మొబైల్ నంబర్లకు ఫోన్‌పే ద్వారా రూ.55 వేలు బదిలీ చేశాడు.

మోసం జరిగినట్లు గుర్తించిన బాధితుడి ఫిర్యాదుతో రామన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కూరమను శ్రీనివాసరావును అరెస్టు చేసినట్లు సమాచారం.