BREAKING
thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప
Test 4
Date of Publish : 16 November 2026, 08:17 pm
Posted by : K MAHESH

మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / రామన్నపేట
Reporter
K Mahesh Munugodu Constituency
16 Nov, 2026 - 08:17 PM
5 వీక్షణలు

జిల్లా కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం

రామన్నపేట, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్):

మునిపంపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళా స్టాఫ్ నర్స్‌ను తక్షణమే నియమించి మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేశం కోరారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మునిపంపుల పీహెచ్‌సీ పరిధిలోని మునిపంపుల గ్రామంతో పాటు చుట్టుపక్కల సుమారు 15 గ్రామాల ప్రజలు వైద్య సేవల కోసం ఈ ఆసుపత్రిపై ఆధారపడుతున్నారని తెలిపారు. గత రెండున్నర సంవత్సరాలుగా ఆసుపత్రిలో మహిళా స్టాఫ్ నర్స్ అందుబాటులో లేకపోవడంతో మహిళా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చే మహిళలు తగిన వైద్య సేవలు పొందడంలో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. మహిళలు తమ ఆరోగ్య సమస్యలను స్వేచ్ఛగా వివరించేందుకు మహిళా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండటం ఎంతో అవసరమని అన్నారు.

గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్యం అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, మునిపంపుల పీహెచ్‌సీలో వెంటనే మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించడంతో పాటు అవసరమైన వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు. ఈ సమస్యపై జాయింట్ కలెక్టర్ సానుకూలంగా స్పందించారని సర్పంచ్ వెల్లడించారు.