BREAKING
thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప
Test 4
Date of Publish : 16 November 2026, 08:21 pm
Posted by : K MAHESH

ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
K Mahesh Munugodu Constituency
16 Nov, 2026 - 08:21 PM
6 వీక్షణలు

రూ.2.15 లక్షలకు వాహనాల పార్కింగ్ వేలం దక్కించుకున్న గుడ్డిమల్ల శ్రీనివాస్

పార్టీలకు అతీతంగా జాతరను ఘనంగా నిర్వహించాలి: సర్పంచ్ మానిపాటి శోభాకుమార్

ఇబ్రహీంపట్నం, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్):

మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై సోమవారం గ్రామసభ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మానిపాటి శోభాకుమార్, ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, గ్రామ కార్యదర్శి చిలుకల వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జాతర నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించారు.

ఈ సందర్భంగా గత ఏడాది జాతరలో వచ్చిన విరాళాల ఆదాయ, వ్యయాల వివరాలను సక్రమంగా వెల్లడించాలని గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు ఎండోమెంట్ అధికారులను, కమిటీ సభ్యులను కోరారు. గ్రామ పెద్దలు, ప్రజలకు సమాచారం ఇవ్వకుండా, గ్రామ సర్పంచ్‌కు కూడా తెలియకుండా ఎండోమెంట్ కమిటీ ఏర్పాటు చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొందరు కావాలనే రాజకీయాలు చేస్తున్నారని ఆక్షేపించారు.

గ్రామపంచాయతీ వార్డు సభ్యుడు కొండిగారి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఎండోమెంట్ కమిటీ ఏర్పాటు వల్ల దేవాలయానికి ప్రయోజనం కలగకుండా ఖర్చులు పెరిగాయని అభిప్రాయపడ్డారు. కమిటీ ఏర్పాటు చేసినప్పుడు ప్రభుత్వం దేవాలయ అభివృద్ధికి కనీసం రూ.కోటి నిధులు మంజూరు చేయాలని, జాతరకు వచ్చిన విరాళాలనే వివిధ అవసరాలకు ఖర్చు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఎండోమెంట్ కమిటీ ఉంటే ఆలయంలో ప్రతిరోజూ దీపధూప నైవేద్యాలతో పూజలు నిర్వహించేలా చూడాలని కోరారు.

మరో వార్డు సభ్యుడు పున్నం రాము మాట్లాడుతూ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి అధికారికంగా ఎండోమెంట్ కమిటీ ఏర్పాటు చేశారా, లేక తాత్కాలిక కమిటీని నియమించారా అని అధికారులను ప్రశ్నించారు. కమిటీ అధికారికంగా ఏర్పాటైతే సంబంధిత పత్రాలపై ఎండోమెంట్ శాఖ ముద్ర, సంతకాలు ఎక్కడ ఉన్నాయని నిలదీశారు. అయితే ఈ ప్రశ్నలకు ఎండోమెంట్ అధికారులు సరైన సమాధానం ఇవ్వలేదని గ్రామస్తులు తెలిపారు.

అనంతరం సర్పంచ్ మానిపాటి శోభాకుమార్, ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్ మాట్లాడుతూ జాతర ఉత్సవాలను రాజకీయాలకు అతీతంగా అందరూ సమన్వయంతో కలిసి ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

అనంతరం జాతర సందర్భంగా వాహనాల పార్కింగ్ ఏర్పాటుకు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంలో ఆరుట్ల గ్రామానికి చెందిన గుడ్డిమల్ల శ్రీనివాస్ ముదిరాజ్ రూ.2 లక్షల 15 వేలకు పార్కింగ్ టెండర్ దక్కించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ అధికారులు, కమిటీ సభ్యులు, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.