BREAKING
thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప
Test 4
Date of Publish : 16 November 2026, 08:18 pm
Posted by : K MAHESH

ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
K Mahesh Munugodu Constituency
16 Nov, 2026 - 08:18 PM
7 వీక్షణలు

బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు: ఎంపీడీవో వనపర్తి అద్విత

ఖానాపూర్, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్):

విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే ఉద్దేశంతో ఖానాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఖానాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, పెద్దమ్మగడ్డ ప్రాథమిక పాఠశాల, కొత్తూరు ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు బాలల హక్కులు, బాలల సంరక్షణపై అవగాహన కల్పించారు. మండల స్థాయిలో పనిచేస్తున్న 23 ప్రభుత్వ శాఖలు, వాటి అధికారుల గురించి విద్యార్థులకు పరిచయం చేశారు. బాల కార్మిక వ్యవస్థ వల్ల కలిగే అనర్థాలను వివరించడంతో పాటు, బాలల సహాయం కోసం అందుబాటులో ఉన్న టోల్‌ఫ్రీ నంబర్‌ గురించి తెలియజేశారు.

ఈ కార్యక్రమం ద్వారా బాలల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి కృషి చేయడంపై అధికారులు అవగాహన కల్పించారు.