BREAKING
thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప thumb ● ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులతో కలిసి ధర్నా చేసిన మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి thumb ● పోలీస్ అధికారిగా నమ్మించి రూ.55 వేల ఆన్‌లైన్ మోసం thumb ● ఆరుట్లలో బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర ఏర్పాట్లపై గ్రామసభ thumb ● ఖానాపూర్‌లో బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ thumb ● మునిపంపుల పీహెచ్‌సీలో మహిళా స్టాఫ్ నర్స్‌ను నియమించాలి thumb ● వావిళ్లపల్లిలో 51 మందికి నూతన పెన్షన్లు మంజూరు thumb ● గ్రామ పెద్ద దిక్కును కోల్పోయాం.. జనార్దన్ రెడ్డి సేవలు మరువలేనివి thumb ● బండరామారంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● మహిళా సంఘం ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం thumb ● పాకాల వాగులో జాలరి వలకు చిక్కిన వింత చేప
Test 4
Date of Publish : 16 November 2026, 07:45 pm
Posted by : K MAHESH

ఘనంగా మాజీ సర్పంచ్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / వలిగొండ
Reporter
K Mahesh Munugodu Constituency
16 Nov, 2026 - 07:45 PM
6 వీక్షణలు

విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు

వలిగొండ, నవంబర్ 16 (ఎన్ టుడే న్యూస్): యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మాజీ సర్పంచ్, రామన్నపేట మాజీ సమితి ప్రెసిడెంట్ కుంభం రమణారెడ్డి 24వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ కుంభం వెంకట పాపిరెడ్డి, వలిగొండ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తిని సహదేవ్, పట్టణ అధ్యక్షుడు పోలేపాక జానకిరాములు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా మండల కేంద్రంలోని కుంభం రమణారెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కుంభం రమణారెడ్డి వలిగొండ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా సుమారు 40 సంవత్సరాల పాటు సేవలందించారని గుర్తుచేశారు. వలిగొండలో సబ్‌స్టేషన్, బస్టాండ్, ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ ఏర్పాటుకు భూమిని దానం చేసిన ఉదార స్వభావం కలిగిన నాయకుడని కొనియాడారు. గ్రామ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, మండల నాయకులు తుమ్మల యుగంధర్ రెడ్డి, పబ్బు సురేందర్ గౌడ్, కొండూరు భాస్కర్, బత్తిని నగేష్, బందారపు లింగస్వామి, సీలోజు శ్రీరాములు, చిలుగూరి సత్తిరెడ్డి, ఎమ్మె లక్ష్మయ్య, ఎమ్మె మల్లేశం, ఎమ్మె లింగస్వామి, కొండూరు సాయి, పల్లెర్ల రాజు, రేగు శ్రీనివాస్, పల్లెర్ల లక్ష్మయ్య, మునుకుంట్ల ధనుంజయ, కీర్తి రమేష్, మైసొల్లు రామనర్సు, బత్తిని వరుణ్, రేగు శీను, ఐటీపాముల పుష్పమ్మ, మత్స్యగిరి గుట్ట ధర్మకర్త కూర వెంకటేశం, పడమటి దామోదర్ రెడ్డి, మాజీ ధర్మకర్త పోలేపాక భిక్షపతి, రాచమల్ల తిరుపతయ్య, మల్గా పాండు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.