BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 26 November 2026, 08:25 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరుమల శ్రీవారికి రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాల విరాళం

ఆంధ్రప్రదేశ్
/ తిరుపతి
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
26 Nov, 2026 - 08:25 PM
32 వీక్షణలు

46 ఆభరణాలను సమర్పించిన చెన్నైకి చెందిన వర్థమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆభరణాల సమర్పణ

తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి చరిత్రలోనే అత్యంత విలువైన విరాళాల్లో ఒకటిగా నిలిచే భారీ కానుకను చెన్నైకి చెందిన వర్థమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు సమర్పించారు. గురువారం రూ.206 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాలను శ్రీవారికి కానుకగా అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ మహా విరాళం సమర్పణ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీవారి దర్శనం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దాత దంపతులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి రంగనాయకుల మండపంలో ప్రదర్శించిన 46 బంగారు ఆభరణాలను పరిశీలించారు. ఇంతటి విలువైన ఆభరణాలను స్వామివారికి సమర్పించిన దాతల ఉదారతను ముఖ్యమంత్రి అభినందించారు. అనంతరం దాత కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు తలపై ఆభరణాల పళ్లెంలను ధరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో శ్రీవారి సన్నిధికి చేరుకుని ఆభరణాలను స్వామివారి ఎదుట సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విరాళంలో మొత్తం 121 కిలోల 24 క్యారెట్ల బంగారం ఉండగా, అందులో 106 కిలోల బంగారంతో శ్రీవారి కోసం వివిధ రకాల ఆభరణాలను రూపొందించారు. మిగిలిన 15 కిలోల బంగారంతో తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారికి స్వర్ణ వస్త్రాన్ని తయారు చేయనున్నారు. తయారీ ఖర్చులతో కలిపి ఈ ఆభరణాల మొత్తం విలువ రూ.206 కోట్లుగా టీటీడీ వెల్లడించింది. మొత్తం 46 ఆభరణాలను 33 రకాలుగా రూపొందించారు. వీటిలో పాద కవచాలు, అందెలు, తులసిపత్ర హారం, అష్టోత్తర శత కాసుల మాల, చతుర్భుజ లక్ష్మీ హారం, కౌస్తుభం, శ్రీవత్సం, సూర్యకంఠి, చంద్రవంక కంఠి, నాగాభరణాలు, భుజకీర్తులు, శాలిగ్రామ హారాలు, శంఖం, చక్రం కవచాలు, కిరీటం తదితర విలువైన ఆభరణాలు ఉన్నాయి. ఈ ఆభరణాల తయారీలో విలువైన రత్నాలను కూడా వినియోగించారు. మొత్తం 238.2 క్యారెట్ల వజ్రాలు, 2,247.7 క్యారెట్ల నీలమణులు, 91.6 క్యారెట్ల పసుపు నీలమణులు, 84.2 క్యారెట్ల కెంపులు, పచ్చలతో పాటు 2,916.5 గ్రాముల సాలగ్రామ రాళ్లను ఉపయోగించారు. బంగారం, విలువైన రత్నాలతో రూపొందించిన ఈ ఆభరణాలు శ్రీవారి అలంకరణకు మరింత ప్రత్యేకతను తీసుకురానున్నాయి. ఈ కార్యక్రమంలో టీటీడీ సాధికార మండలి చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవోలు డా. శరత్, గోపీనాథ్, సీవీఎస్వో మురళీకృష్ణ, జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. భారీ విలువైన బంగారు ఆభరణాలను శ్రీవారికి సమర్పించడం ద్వారా దాత దంపతులు తమ భక్తి భావాన్ని చాటుకోవడంతో పాటు తిరుమల చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విరాళాన్ని అందించారు.