BREAKING
thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● నాంపల్లి కాంగ్రెస్ నూతన కార్యవర్గ సమావేశం.. పార్టీ బలోపేతంపై చర్చ thumb ● నూతన పింఛన్‌దారులకు పింఛన్ పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి thumb ● పవిత్రాత్మ పాఠశాలలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు thumb ● యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలి thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న హారికకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● శుభకార్యాలకు హాజరై చిన్నారులను ఆశీర్వదించిన టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి thumb ● నేరాల నియంత్రణకు పోలీసుల నాకాబంధీ.. ముమ్మర వాహన తనిఖీలు thumb ● గోపాల్ గౌడ్ మృతి గౌడ సమాజానికి తీరని లోటు thumb ● కన్నెకంటి వెంకటేశ్వరాచారికి బీజేపీలో కీలక బాధ్యతలు thumb ● నూతన పెన్షన్ లబ్ధిదారులకు పత్రాలు అందజేసిన సర్పంచ్ దేవేంద్ర మోహన్ రెడ్డి
Test 4
Date of Publish : 27 November 2026, 09:56 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కందుకూరులో వైభవంగా శ్రీ అయ్యప్ప స్వామి నగరోత్సవం

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana ప్రకాశం జిల్లా స్టాఫ్ రిపోర్టర్
27 Nov, 2026 - 09:56 PM
10 వీక్షణలు

మేళతాళాలు, కేరళ డోలు వాయిద్యాలు, కోలాటాల నడుమ భక్తిశ్రద్ధలతో ఊరేగింపు

కందుకూరు, నవంబర్ 27:

కందుకూరు పట్టణంలో శ్రీ అయ్యప్ప స్వామి నగరోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. శ్రీ అయ్యప్ప స్వామి సేవా సంఘం, భక్తుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

స్థానిక అయ్యప్ప స్వామి ఆలయం వద్ద ప్రారంభమైన నగరోత్సవం పట్టణ బస్టాండ్ సెంటర్, పోస్టాఫీస్ సెంటర్, పెద్ద బజారు మీదుగా శ్రీ స్కందపురి సోమేశ్వరాలయం వరకు కొనసాగింది. సాయంత్రం వేళ మేళతాళాలు, కోలాట నృత్యాలు, కేరళ సంప్రదాయ డోలు వాయిద్యాల నడుమ ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. ‘స్వామియే శరణం అయ్యప్ప’ నినాదాలతో పట్టణ వీధులు మార్మోగాయి.

ఈ వేడుకల్లో కేరళకు చెందిన 14 మంది డోలు వాయిద్య కళాకారులు సంప్రదాయ మంగళ వాయిద్యాలను వినిపించారు. స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించి, విద్యుత్ దీపాల వెలుగుల మధ్య ఊరేగించారు. యువతీ యువకులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు నగరోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

స్వామివారి అలంకరణ, ఊరేగింపును తిలకించిన భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. నగరోత్సవానికి వచ్చిన వేలాది మంది భక్తులకు నిర్వాహకులు మణికంఠుని మహాప్రసాదాన్ని పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి సేవా సంఘం సభ్యులు, అయ్యప్ప మాలధారణ స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.