ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం
తెలంగాణ ఉద్యమకారుడు నలపరాజు రమేష్‌కు ఘన సన్మానం
యాదాద్రి-భువనగిరి (ఎన్ టుడే న్యూస్): తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్‌ఎస్‌వీ మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు నలపరాజు రమేష్‌కు ఘన సన్మానం లభించింది. ఆదివారం యాదాద్రి-భువనగిరి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో ఆయనను సత్కరించారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో నలపరాజు రమేష్ నిజాం కళాశాలలో విద్యనభ్యసిస్తూ ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. నిజాం కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీతో పాటు మునుగోడు నియోజకవర్గంలో విద్యార్థులను తెలంగాణ ఉద్యమం వైపు చైతన్యపరిచారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో లాఠీ దెబ్బలు ఎదుర్కొని, పలు కేసులను భరిస్తూ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. రాష్ట్ర సాధనలో తనవంతు పాత్ర పోషించిన రమేష్‌ను దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నాయకులు సన్మానించారు.