ఎస్ఐగా పదోన్నతి పొందిన పోడేటి వెంకన్న గౌడ్‌కు ఘన సన్మానం
లక్ష్మీనగర్ కాలనీలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం, కాలనీ పెద్దల ఆధ్వర్యంలో కార్యక్రమం
మంచిర్యాల: ఏఎస్ఐ నుంచి సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ)గా పదోన్నతి పొందిన పోడేటి వెంకన్న గౌడ్‌కు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని 51వ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో ఆదివారం ఘనంగా సన్మానం నిర్వహించారు. సిర్పూర్ కాగజ్‌నగర్‌కు బదిలీ అయిన సందర్భంగా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం, కాలనీ పెద్దల ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి 51వ డివిజన్ కార్పొరేటర్ దంపతులు నీలి స్వప్న, శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వెంకన్న గౌడ్‌కు శాలువా కప్పి, పూల బొకే అందజేసి అభినందించారు.
ఈ సందర్భంగా నీలి శ్రీనివాస్ మాట్లాడుతూ.. జన్నారం సమీపంలోని మారుమూల గోడిశాల గ్రామంలో సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన వెంకన్న గౌడ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదుగుతూ హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం ఎస్ఐగా పదోన్నతి పొందడం అభినందనీయమని అన్నారు.
విధుల్లో చేరినప్పటి నుంచి నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నతాధికారులు, ప్రజల మన్ననలు పొందడం ఆదర్శనీయమని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, నాయకులు గోపతి లక్ష్మణ్, గూడ రాజిరెడ్డి, మంచాల రామయ్య, గూడ శ్రీనివాస్, మామిడాల సత్యనారాయణ, సింగ్, చుంచు పోషన్న, గుజ్జ శంకర్, కృష్ణ రెడ్డన్న, బిల్లా రాజయ్య, శ్రీనివాస్ టీచర్, ఆర్ఎంపీ డాక్టర్ వెంకట్ రెడ్డి, కె. చంద్రమౌళి, ఎం. రాజయ్య, సుభాష్ రెడ్డి, రిజ్వాన్, అక్కల తిరుపతి, ఏఎస్ఐ సురేష్ గౌడ్, బోజన్న తదితరులు పాల్గొన్నారు.