జగిత్యాలలో ఘనంగా రాయల్ బ్యాంక్విట్ హాల్ ప్రారంభోత్సవం
జగిత్యాలలో ఘనంగా "రాయల్ బ్యాంక్విట్ హాల్" ప్రారంభోత్సవం
జగిత్యాల, అక్టోబర్ 11:
జగిత్యాల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన "ఏటీఎం రాయల్ బ్యాంక్విట్ హాల్" ప్రారంభోత్సవ వేడుక ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య అతిథులుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి గారు మరియు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా వారు రిబ్బన్ కట్ చేసి బ్యాంక్విట్ హాల్‌ను ప్రారంభించారు. అనంతరం నూతన వసతి గృహం, వేడుకల హాల్‌ను పరిశీలించి, నిర్వాహకులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. జగిత్యాల పట్టణ ప్రజలకు శుభకార్యాలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో యాజమాన్య బృందం, స్థానిక ప్రముఖులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.