హేమంత్‌పై పోలీసుల కాల్పులు.. అయ్యవారిపల్లిలో సంబరాలు బాణసంచా పేల్చి ఆనందం వ్యక్తం చేసిన విద్యార్థులు, గ్రామస్థులు
ఆంధ్రప్రదేశ్
/
అనంతపురం
జిల్లా ఎస్పీ జగదీష్‌కు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు ఎన్ టుడే న్యూస్: అనంతపురం జిల్లా, రాప్తాడు మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన బాలికపై దాడి చేసిన కేసులో నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపారన్న వార్తతో గ్రామంలో సంబరాలు నెలకొన్నాయి. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు, గ్రామస్థులు బాణసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. బాలికకు న్యాయం జరగాలనే ఆకాంక్షతో ఉన్న స్థానికులు, నిందితుడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టిన పోలీసులపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్‌కు విద్యార్థులు, ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. బాలికకు న్యాయం జరిగేలా కేసులో చట్టపరమైన చర్యలు కొనసాగించాలని వారు ఆకాంక్షించారు.