BREAKING
thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● ఉద్యమ నాయకుడు టిఆర్ఎస్వి మునుగోడు అధ్యక్షుడు రమేష్ కి ఘనంగా సన్మానం thumb ● ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత thumb ● శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం
Date of Publish : 11 October 2026, 03:49 pm
Posted by : V శ్రీనివాస్

లోన్ యాప్ బాధితుడిని పరామర్శించిన జనసేన నేత డాక్టర్ రాజ్ కిరణ్

తెలంగాణ
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
11 Oct, 2026 - 03:49 PM
70 వీక్షణలు

మంచిర్యాల: లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మంచిర్యాలకు చెందిన యువకుడిని జనసేన పార్టీ పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ డాక్టర్ రాజ్ కిరణ్ పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.


ఈ సందర్భంగా డాక్టర్ రాజ్ కిరణ్ మాట్లాడుతూ.. ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదని, ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా వాటిని ఎదుర్కోవాలని సూచించారు. సమస్యలు ఎదురైనప్పుడు ఒంటరిగా బాధపడకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నమ్మకమైన వ్యక్తుల సహాయం తీసుకోవాలని కోరారు. ఆపదలో ఉన్న బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.


లోన్ యాప్‌ల పేరుతో కొందరు నిర్వాహకులు బెదిరింపులు, అసభ్యకర సందేశాలు పంపుతూ వ్యక్తిగత సమాచారాన్ని ఉపయోగించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వేధింపులకు పాల్పడేవారిపై పోలీసులు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


వేధింపులకు వ్యతిరేకంగా సమాజం సమష్టిగా స్పందించాలని, బాధితులకు అండగా నిలిచి వారి ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని డాక్టర్ రాజ్ కిరణ్ పిలుపునిచ్చారు.