BREAKING
thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
Date of Publish : 11 October 2026, 05:43 am
Posted by : GOUTHAM RUDRARAPU

కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

తెలంగాణ
/ సంగారెడ్డి / అమీన్‌పూర్
Reporter
Goutham Rudrarapu పటాన్ చెరు నియోజకవర్గ ప్రతినిధి
11 Oct, 2026 - 05:43 AM
12 వీక్షణలు

​అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజైన ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలను కాలనీ మహిళలు, స్థానికులు కలిసికట్టుగా భక్తిశ్రద్ధలు, ఉత్సాహంతో నిర్వహించారు.

​తీరొక్క పూలైన తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం వేళ మహిళలంతా సాంప్రదాయ దుస్తుల్లో ఒక్కచోట చేరి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ జానపద పాటలు పాడారు.

​ఈ వేడుకల్లో కాలనీ వాసులు, పెద్దలు, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేసి, మహిళలు ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కాలనీ వాసులంతా ఐక్యంగా పాల్గొనడంతో దుర్గానగర్ కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.