BREAKING
thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు
Date of Publish : 26 June 2025, 09:22 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బొమ్మలరామారం లో అక్రమ క్వారీ బ్లాస్టింగ్ పై లోకయుక్త కమిషన్ విచారణ

తెలంగాణ
26 Jun, 2025 - 09:22 AM
258 వీక్షణలు
బొమ్మలరామారం మండలంలో అక్రమ బ్లాస్టింగ్ వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని లోకయుక్త కమిషన్ లో ఇచ్చిన ఫిర్యాదు పై విచారణ జరిపిన లోకయుక్త కమిషన్ సభ్యులు, జిల్లా అధికారుల బృందం N TODAY NEWS: బొమ్మలరామారం యాదాద్రి భువనగిరి జిల్లా,బొమ్మలరామారం మండలంలోని రంగాపూర్ గ్రామానికి చెందిన ప్రజా పోరాటాల సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మైలారం జంగయ్య మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న క్రషర్లు అక్రమ బ్లాస్టింగ్ వల్ల ఇల్లులు పాడవుతున్నాయని, రోడ్లపై అధిక లోడుతో వెళ్తున్న క్రషర్ వాహనాల దుమ్ము, కంకర వల్ల జనజీవనానికి నష్టం కలుగుతుందని లోక యుక్తా కమిషన్ లో ఇచ్చిన ఫిర్యాదు పై గురువారం రోజున లోకాయుక్త కమిషన్ ఎస్పి వెంకట్ రావు, డి.ఎస్.పి విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో బొమ్మలరామారం మండలంలోని రామలింగంపల్లి, పెద్దపార్వతాపురం, బొమ్మలరామారం మండల కేంద్రంలోని దాదాపుగా పది క్రషర్లను క్వారీలను లోకయుక్త కమిషన్ బృందం క్షుణ్ణంగా పరిశీలించారు ఎక్కడ కూడా మైనింగ్ నిబంధనలు పాటించలేదని ప్రాథమికంగా వారి దృష్టికి వచ్చింది మెటల్ క్లాటింగ్ ద్వారా క్వారీల బ్లాస్టింగ్ ఆరు మీటర్లు బ్లాస్టింగ్ చేయాల్సి ఉంది కానీ ప్రభుత్వ నిబంధన తుంగలో తొక్కి ఇష్టానుసారంగా బ్లాస్టింగ్ చేయడం జరుగుతుంది పర్మిషన్ ఒక దగ్గర బ్లాస్టింగ్ ఒక దగ్గర చేస్తున్నా మండల క్రషర్ నిర్వాహకులు, మండల కేంద్రంలో క్రషర్లకు మైనింగ్ లీజ్ తీసుకున్న యజమానులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఒక మైనింగ్ ను ఒకటి లేదా రెండు క్రషర్లకు అమ్ముకుంటున్నారు మండలంలో ఉన్న క్రషర్ల యజమానులు రాయల్టీ కట్టకుండా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు లోకాయుక్త కమిషన్ మైనింగ్ ఏడి, సెంట్రల్ మైనింగ్ సేఫ్టీ అథారిటీ అధికారులను ప్రశ్నించగా తమ దగ్గర పూర్తి డాటా లేదని త్వరలో తెప్పించుకుంటామని తెలపడం విడ్డూరం. లోకాయుక్త కమిషన్ సభ్యులకు యజమానులను మీ అనుమతులు ఉన్నాయా అని అడగ్గా ఉన్నాయని కొందరు కార్యాలయం దగ్గరికి వచ్చి కలుస్తామని కొందరు సార్ కి ఇస్తామని కొందరు చెప్పడం కోస మెరుపు. మెటల్ క్లాటింగ్ చేయడానికి ఎక్స్ప్లోవ్స్ సంబంధించిన బ్లాస్టింగ్ మెటీరియల్ ను ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో మ్యాగజైన్ ను ఎంతో తీసుకుంటున్నాము రికార్డ చేసి మిగిలిన పేలుడు పదార్థాలను భద్రతరాపరమైన గదిలో భద్రపరిచి వాటి రికార్డు ఆన్లైన్లో ఎక్స్క్లూజివ్ సైట్ లో నమోదు చేసి వివరాలు పొందుపరచాలి విచారణ జరిపిన 10 క్రషర్లలో పేలుడు పదార్థాలు భద్రపరచడానికి సరైన రూము వ్యవస్థ లేకపోవడం విడ్డూరం. బ్లాస్టింగ్ చేయడానికి నియమ నిబంధన కలిగిన బ్లాస్టరు లేకపోవడం వారికి లైసెన్స్ లేకపోవడం వారే బ్లాస్టింగ్ చేయడం ద్వారా ప్రమాదాలు జరిగి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ లోకాయుక్త కమిషన్ సంబంధిత అధికారులను ప్రశ్నించగా అధికారులు సమాధానం చెప్పలేక దాటు వేసే ప్రయత్నం చేశారు లోకాయుక్త కమిషన్ డిఎస్పి విద్యాసాగర్ రావు మాట్లాడుతూ క్రషర్లలో అన్ని కోణాలలో పరిశీలించామని ప్రాథమికంగా అక్రమాలు జరిగినట్టు మా దృష్టికి వచ్చిందని తెలిపారు క్రషర్లకు సంబంధించి అనుమతులను ఇచ్చిన ప్రతి శాఖకు లిఖితపూర్వకంగా నోటీసులు ఇస్తామని క్రషర్ యజమానులు, క్వారీ యజమానులకు ఇచ్చిన అనుమతులను వారికి కేటాయించిన హెక్టార్ల భూమి లీజు హద్దులు డిజిటల్ సర్వే ద్వారా పూర్తి సమాచారం తీసుకుని నెల రోజుల్లో నిబంధనలు పాటించని క్రషర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. క్రషర్ క్వారీలలో బ్లాస్టింగ్ ల ద్వారా విషపూరితమైన నీటి నిల్వలు ఉండడంతో వాటిని అక్కడి నుండి తొలగించడానికి మోటార్లతో పక్కనే ఉన్న చెరువులు కుంటలలో వదిలేస్తే ఆ విషపూరితమైన నీళ్లను తాగి మూగజీవాలు బలవుతున్నాయని స్థానికులు లోకాయుక్త కమిషన్ ఎదుట వాపోయారు. వెంటనే లోకాయుక్త కమిషన్ సభ్యులు నీటిని ల్యాబ్ పంపియాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం క్రషర్ బ్లాస్టింగ్ ల వల్ల పగుళ్లు వచ్చిన ఇల్లులను రామలింగంపల్లి, పెద్ద పర్వతాపూర్ గ్రామాలలో లోకాయుక్త కమిషన్ సభ్యులు, జిల్లా అధికారుల బృందం ధ్వంసం అయిన ఇల్లులను పూర్తిగా పరిశీలించారు లోకాయుక్త కమిషన్ వెంట భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇ ఇ వెంకన్న, హైదరాబాద్ మైనింగ్ సేఫ్టీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ సనత్ కుమార్, జిల్లా మైనింగ్ ఏడి రాఘవరెడ్డి, జిల్లా అసిస్టెంట్ మైనింగ్ ఏడి రవికుమార్, మైనింగ్ సర్వేయర్ సుజాత, బొమ్మలరామారం ఎమ్మార్వో పి. శ్రీనివాస్ రావు, మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, సర్వేయర్ శ్రీనివాస్, భువనగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రబాబు, స్థానిక ఎస్సై శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube