మంచిర్యాల జిల్లా పదేళ్ల పండుగ.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
వృత్తి సంఘాల నాయకులు, ఉద్యమకారులకు ఘన సన్మానం
మంచిర్యాల జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కేసీఆర్ నాయకత్వంలో, మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కృషితో జిల్లా ఏర్పాటైందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అనంతరం నడిపెల్లి దివాకర్ రావు నివాసంలో వృత్తి సంఘాల నాయకులు, ఉద్యమకారులను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్‌తో పాటు ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, టిబీజీకేఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.