BREAKING
thumb ● సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా: ఎన్నికల అధికారి సునీల్‌ ఖన్నా thumb ● చౌడేపల్లి నూతన తహసీల్దార్‌గా ఎస్. ప్రమీల బాధ్యతల స్వీకరణ thumb ● ఐడీఎల్ కంపెనీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు thumb ● అమిత్ షా సభకు భారీగా తరలివెళ్లిన తెల్లాపూర్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు thumb ● జాతీయ రహదారి 65పై ఘోర ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ దుర్మరణం thumb ● మురసు తుపాను పరిస్థితులపై కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ thumb ● మురసు తుఫాన్‌ ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక! thumb ● ఉచిత పెళ్లి రిజిస్ట్రేషన్ క్యాంప్‌కు పోటెత్తిన జనం.. thumb ● 47 ఏళ్లలో తొలిసారి.. సీఆర్‌పీఎఫ్ చరిత్రలో అరుదైన ఘనత thumb ● ఉత్తమ్‌పై రాజగోపాల్‌రెడ్డి ఫైర్.. మునుగోడుకు నిధులేవి? thumb ● సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా: ఎన్నికల అధికారి సునీల్‌ ఖన్నా thumb ● చౌడేపల్లి నూతన తహసీల్దార్‌గా ఎస్. ప్రమీల బాధ్యతల స్వీకరణ thumb ● ఐడీఎల్ కంపెనీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు thumb ● అమిత్ షా సభకు భారీగా తరలివెళ్లిన తెల్లాపూర్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు thumb ● జాతీయ రహదారి 65పై ఘోర ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ దుర్మరణం thumb ● మురసు తుపాను పరిస్థితులపై కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ thumb ● మురసు తుఫాన్‌ ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక! thumb ● ఉచిత పెళ్లి రిజిస్ట్రేషన్ క్యాంప్‌కు పోటెత్తిన జనం.. thumb ● 47 ఏళ్లలో తొలిసారి.. సీఆర్‌పీఎఫ్ చరిత్రలో అరుదైన ఘనత thumb ● ఉత్తమ్‌పై రాజగోపాల్‌రెడ్డి ఫైర్.. మునుగోడుకు నిధులేవి?
మంచి మాట
Date of Publish : 03 November 2026, 11:44 am
Posted by : KOLA MAHESH

ఐడీఎల్ కంపెనీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు

తెలంగాణ
/ నల్గొండ
Reporter
Kola Mahesh Munugodu Constituency
03 Nov, 2026 - 11:44 AM
9 వీక్షణలు

పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడిన భవన శిథిలాలు.. ముగ్గురి పరిస్థితి విషమం

నార్కట్‌పల్లి, నవంబర్ 3 (ఎన్ టుడే న్యూస్): నల్గొండ జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం గోపులాయిపల్లిలో ఉన్న ఐడీఎల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు కంపెనీ భవనంలోని కొన్ని భాగాలు ధ్వంసమై చుట్టుపక్కల చెల్లాచెదురుగా పడిపోయాయి.

ఒడిశాకు చెందిన ముగ్గురు.. రామన్నపేటకు చెందిన మరొకరు

ప్రమాదంలో గాయపడిన నలుగురు కార్మికుల్లో ముగ్గురు ఒడిశా రాష్ట్రానికి చెందినవారిగా, మరొకరు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటకు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సమాచారం.

ముగ్గురి పరిస్థితి విషమం

గాయపడిన వారిని తొలుత ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు తెలుస్తోంది.

పేలుడుకు కారణాలపై ఆరా

కంపెనీలో పేలుడు ఎలా సంభవించింది? ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది.