BREAKING
thumb ● ఐడీఎల్ కంపెనీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు thumb ● అమిత్ షా సభకు భారీగా తరలివెళ్లిన తెల్లాపూర్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు thumb ● జాతీయ రహదారి 65పై ఘోర ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ దుర్మరణం thumb ● మురసు తుపాను పరిస్థితులపై కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ thumb ● మురసు తుఫాన్‌ ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక! thumb ● ఉచిత పెళ్లి రిజిస్ట్రేషన్ క్యాంప్‌కు పోటెత్తిన జనం.. thumb ● 47 ఏళ్లలో తొలిసారి.. సీఆర్‌పీఎఫ్ చరిత్రలో అరుదైన ఘనత thumb ● ఉత్తమ్‌పై రాజగోపాల్‌రెడ్డి ఫైర్.. మునుగోడుకు నిధులేవి? thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి thumb ● ఐదుసార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ఎంపీ అయినా కుండల వ్యాపారమేనా? thumb ● ఐడీఎల్ కంపెనీలో భారీ పేలుడు.. నలుగురు కార్మికులకు తీవ్ర గాయాలు thumb ● అమిత్ షా సభకు భారీగా తరలివెళ్లిన తెల్లాపూర్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు thumb ● జాతీయ రహదారి 65పై ఘోర ప్రమాదం.. డీసీఎం డ్రైవర్ దుర్మరణం thumb ● మురసు తుపాను పరిస్థితులపై కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ thumb ● మురసు తుఫాన్‌ ప్రభావం.. తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక! thumb ● ఉచిత పెళ్లి రిజిస్ట్రేషన్ క్యాంప్‌కు పోటెత్తిన జనం.. thumb ● 47 ఏళ్లలో తొలిసారి.. సీఆర్‌పీఎఫ్ చరిత్రలో అరుదైన ఘనత thumb ● ఉత్తమ్‌పై రాజగోపాల్‌రెడ్డి ఫైర్.. మునుగోడుకు నిధులేవి? thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి thumb ● ఐదుసార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ఎంపీ అయినా కుండల వ్యాపారమేనా?
మంచి మాట
Date of Publish : 03 November 2026, 11:42 am
Posted by : PABBINEEDI B SANKAR

అమిత్ షా సభకు భారీగా తరలివెళ్లిన తెల్లాపూర్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు

తెలంగాణ
/ సంగారెడ్డి
Reporter
Pabbineedi B Sankar Tellapur Mandal
03 Nov, 2026 - 11:42 AM
7 వీక్షణలు

హైదరాబాద్: కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు మల్లేపల్లి రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెల్లాపూర్ డివిజన్‌కు చెందిన బీజేపీ నాయకులు, కిసాన్ మోర్చా నాయకులు హైదరాబాద్‌లో నవంబర్ 2న నిర్వహించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభకు, బీజేపీ మహాపాదయాత్రకు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ లక్ష్యంగా నిర్వహించిన ఈ మహాపాదయాత్ర నిజాం కాలేజ్ ఎదురుగా ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద ప్రారంభమై అబిడ్స్ మీదుగా మొజంజాహి మార్కెట్ వరకు కొనసాగింది. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో తెల్లాపూర్ డివిజన్ ఇన్‌చార్జి, రాష్ట్ర నాయకుడు అంజనేయులు, కిసాన్ మోర్చా జిల్లా ఇన్‌చార్జి రాజు, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షుడు మోహన్ రెడ్డి, కిసాన్ మోర్చా నాయకుడు వై. రాజు పాల్గొన్నారు.

అలాగే తెల్లాపూర్ డివిజన్ నాయకులు మాణిక్ రెడ్డి, కె. కృష్ణ యాదవ్, రిషికేశ్ పంతులు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్, ప్రసాద్, గుప్తా, రాజా రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మల్లేపల్లి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు మల్లేపల్లి రాజేందర్ రెడ్డి నాయకత్వంలో తెల్లాపూర్ డివిజన్ నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరుకావడం విశేషం.