BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 11:52 am
Posted by : SEETHA KIRAN KUMAR

హైదరాబాద్‌లో 'నషా ముక్త్ భారత్' పాదయాత్ర: ప్రారంభించనున్న విక్టరీ వెంకటేష్, కిషన్ రెడ్డి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
25 Nov, 2026 - 11:52 AM
7 వీక్షణలు

నేటి నుంచి హైదరాబాద్‌లో ‘నషా ముక్త్ భారత్’ మహా పాదయాత్ర

    విక్టరీ వెంకటేష్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం..

    మూడు రోజుల పాటు కొనసాగనున్న యాత్ర

    హైదరాబాద్, నవంబర్ 25 (ఎన్ టుడే న్యూస్): మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా హైదరాబాద్‌లో నేటి నుంచి మూడు రోజుల పాటు ‘హైదరాబాద్ వాక్స్ – నషా ముక్త్ భారత్’ మహా పాదయాత్ర నిర్వహించనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నాయకత్వంలో నవంబర్ 25 నుంచి 27 వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది.

    నేడు ఉదయం 9 గంటలకు అంబర్‌పేట్ మహంకాళి ఆలయం వద్ద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులు ఎన్. రామచంద్రరావు, డాక్టర్ కె. లక్ష్మణ్, ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించనున్నారు.

    తొలిరోజు పాదయాత్ర అంబర్‌పేట్ నుంచి ప్రారంభమై విద్యానగర్, ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ), ఇఫ్లూ, సీతాఫల్‌మండి, గాంధీ ఆసుపత్రి మీదుగా కొనసాగి ముషీరాబాద్‌లోని కశిష్ ఫంక్షన్ హాల్ వద్ద ముగియనుంది.

    యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. నషా ముక్త్ భారత్ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వివిధ వర్గాల ప్రజలు, యువత ఈ పాదయాత్రలో భాగస్వాములు కానున్నారు.

    మూడు రోజుల పాటు హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో కొనసాగే ఈ పాదయాత్ర ద్వారా మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణంపై విస్తృత అవగాహన కల్పించనున్నారు.