BREAKING
thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన..
Date of Publish : 14 August 2026, 05:54 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

పెళ్లికాని యువకులకు మద్యం నిషేధం..

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Aug, 2026 - 05:54 AM
95 వీక్షణలు

పెళ్లికాని యువకులకు మద్యం నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా!

తమిళనాడులోని ఓ మత్స్యకార గ్రామంలో వినూత్న నిర్ణయం

తమిళనాడులోని విలుండమావడి గ్రామంలో మద్యపానాన్ని నియంత్రించేందుకు మత్స్యకార సంఘం పెద్దలు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా పెళ్లికాని యువకులు మద్యం సేవించకుండా కట్టడి చేయాలని నిర్ణయించారు. మద్యం తాగుతూ పట్టుబడిన పెళ్లికాని యువకుడికి రూ.5 వేల జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు.

అంతేకాకుండా నిబంధనను ఉల్లంఘిస్తున్న యువకుల గురించి సంఘం పెద్దలకు సమాచారం అందించిన వారికి రూ.2 వేల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామంలోని యువత మద్యానికి బానిస కాకుండా వారి భవిష్యత్తును కాపాడటంతో పాటు గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని కొనసాగించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని సంఘం పెద్దలు వెల్లడించారు.

అయితే పెళ్లైన పురుషులకు మాత్రం మద్యం సేవించడంపై పూర్తిస్థాయి నిషేధం విధించలేదు. వారు మద్యం సేవించి గ్రామంలో గొడవలు సృష్టిస్తే మాత్రం రూ.5 వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

యువతను చెడు అలవాట్లకు దూరంగా ఉంచేందుకు గ్రామ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. మద్యపానం వల్ల కుటుంబాలు, యువత భవిష్యత్తు దెబ్బతినకుండా సామాజిక కట్టుబాట్లతో నియంత్రణ తీసుకురావాలన్న ప్రయత్నంగా దీనిని స్థానికులు అభివర్ణిస్తున్నారు.