BREAKING
thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి thumb ● యలమంచిలిలో వైఎస్సార్‌సీపీ ఆశావహ అభ్యర్థులతో కీలక సమావేశం thumb ● అక్టోబర్ 1 నుంచి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ thumb ● మునగపాక లో ఎర్ర వెంకయ్య ఎద్దు మృతి thumb ● మంచిర్యాల జిల్లా : నస్పూర్ గేటు వద్ద లారీ ఆటో డీ... ఇద్దరు మృతి.... thumb ● హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ thumb ● బీఆర్‌ఎస్, బీజేపీ వార్డు సభ్యులు కాంగ్రెస్‌లో చేరిక thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ
Date of Publish : 03 August 2026, 08:41 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రెడ్డిగూడెంలో ప్రత్యేక విక్రయ కేంద్రం ప్రారంభం రూ.52కే బీపీటీ సన్నబియ్యం..

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 08:41 PM
51 వీక్షణలు

రెడ్డిగూడెంలో ప్రత్యేక విక్రయ కేంద్రం ప్రారంభం రూ.52కే బీపీటీ సన్నబియ్యం..  

ఏలూరు జిల్లా రెడ్డిగూడెంలో పెరుగుతున్న బియ్యం ధరల నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే చర్యగా ఎంఎన్‌ఆర్ మార్ట్‌లో నాణ్యమైన బీపీటీ సన్నబియ్యం విక్రయానికి ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సూచనల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక ఎంఎన్‌ఆర్ మార్ట్‌లో ఏర్పాటు చేసిన బియ్యం విక్రయ కేంద్రాన్ని రెడ్డిగూడెం ఎమ్మార్వో ప్రారంభించారు. కార్యక్రమంలో పీడీఎస్ డీటీ నాగరాజు, ఎంఎన్‌ఆర్ మార్ట్ యజమాని నాగేశ్వరరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ, బియ్యం ధరలు పెరుగుతున్న పరిస్థితుల్లో సామాన్య ప్రజలపై భారం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. అందులో భాగంగా నాణ్యమైన బీపీటీ సన్నబియ్యాన్ని కిలో రూ.52కే అందుబాటులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఎంఎన్‌ఆర్ మార్ట్ యజమాని నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సూచనల మేరకు ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని అందుబాటు ధరలో అందించాలనే లక్ష్యంతో ఈ విక్రయ కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. మార్కెట్‌లో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గించేందుకు కిలో రూ.52కే బీపీటీ సన్నబియ్యాన్ని విక్రయిస్తున్నామని చెప్పారు. ప్రజలకు నాణ్యమైన నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే అందించేందుకు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్థానిక ప్రజలు స్వాగతిస్తూ, పెరుగుతున్న ధరల ప్రభావం నుంచి సామాన్య కుటుంబాలకు ఇది కొంత ఉపశమనం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. ఎంఎన్‌ఆర్ మార్ట్‌లో నాణ్యమైన బీపీటీ సన్నబియ్యం అందుబాటులోకి రావడం స్థానిక వినియోగదారులకు ప్రయోజనకరంగా మారనుంది.