BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 07:20 pm
Posted by : PEDDABOINA SRIKANTH

సూరారం వద్ద రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Peddaboina Srikanth Elkathurthi Mandal Reporter
25 Nov, 2026 - 07:20 PM
14 వీక్షణలు

ఎన్‌హెచ్‌-563పై అండర్‌పాస్ లేకపోవడంపై గ్రామస్తుల ఆందోళన

ధర్నాలు, వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని ఆరోపణ

హనుమకొండ జిల్లా, ఎల్కతుర్తి, నవంబర్ 25 | ఎన్ టుడే న్యూస్:

ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామ సమీపంలోని జాతీయ రహదారి ఎన్‌హెచ్‌-563పై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సూరారం గ్రామానికి చెందిన ఓ మహిళ మృతి చెందింది. అండర్‌పాస్ లేకపోవడంతో రహదారి దాటేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. మృతురాలి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

అండర్‌పాస్ లేక ప్రజలకు ఇబ్బందులు

సూరారం వద్ద అండర్‌పాస్ నిర్మించాలని గ్రామస్తులు చాలాకాలంగా కోరుతున్నప్పటికీ సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలకు వెళ్లేందుకు విద్యార్థులు, రైతులు, వ్యవసాయ కూలీలు ప్రతిరోజూ రోడ్డు దాటాల్సి వస్తోందని, ఈ క్రమంలో ప్రమాదాల ముప్పు పెరుగుతోందని పేర్కొంటున్నారు.

సూరారంతో పాటు సమీపంలోని కోతులనడుమ గ్రామ ప్రజలు కూడా అండర్‌పాస్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ సైతం సుమారు మూడు కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు.

వినతులు చేసినా స్పందన లేదని ఆరోపణ

అండర్‌పాస్ నిర్మాణం కోసం పలుమార్లు ధర్నాలు నిర్వహించడంతో పాటు జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులకు రాతపూర్వకంగా వినతిపత్రాలు అందజేసినట్లు గ్రామస్తులు తెలిపారు. గతంలో ప్రజల ఆందోళనల నేపథ్యంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసినప్పటికీ, ఇప్పటివరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు.

అండర్‌పాస్ నిర్మించకపోతే ఆందోళనలు

తాజా ప్రమాదంలో మహిళ మృతి చెందడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి సూరారం వద్ద అండర్‌పాస్ నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామ ప్రజలందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

అండర్‌పాస్ సమస్యకు పరిష్కారం చూపాలని, మరో ప్రాణం ప్రమాదంలో పడకముందే అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.