BREAKING
కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ కొలుసు పార్థసారథి జన్మదినం పురస్కరించుకుని సూరంపాలెంలో కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రం ప్రారంభం భూదాత వెదిరే రామచంద్ర రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం లో. వాతావరణ శాఖ హెచ్చరిక: రాబోయే రోజుల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు కొలుసు పార్థసారథి జన్మదినం- ప్రజల సేవకు అంకితం ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలం, కొండపర్వ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ర్యాలీ పెనుగొలను శాఖా గ్రంథాలయంలొ స్వాతంత్ర్య సమరయోధి తాంతియా తోపే వర్ధంతి నవోదయం 2.0 కార్యక్రమం -నాటు సారా నిర్మూలనపై చర్యలు మున్సిపల్ ట్రాక్టర్ల నిర్లక్ష్యం రోడ్లపైనే రాలుతున్న చెత్త.. మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు మంత్రి పార్థసారధి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన యువనేత చాగంటి రాధాకృష్ణ
www.ntodaynews.com

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

తెలంగాణ
08 Feb, 2026 - 07:41 PM
137 వీక్షణలు
పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే వేముల వీరేశం NTODAY NEWS: చిట్యాల పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం అండగా ఉంటుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. చిట్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సాయంత్రం చిట్యాల 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సిలివేరు శేఖర్‌కు మద్దతుగా ఆయన ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతోందని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం ద్వారా పేదలకు భరోసా కల్పించిందన్నారు. చిట్యాల 10వ వార్డులో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు 90 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధి కోసం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటామని స్పష్టం చేశారు. సామాన్య వ్యక్తులకు కూడా కాంగ్రెస్ పార్టీ గౌరవం, గుర్తింపు ఇస్తుందని, కష్టపడే వారిని ఎలాంటి తేడాలు లేకుండా ప్రోత్సహిస్తుందని తెలిపారు. ప్రజలు ఓటు వేయేటప్పుడు అందుబాటులో ఉండే నాయకుడిని ఎంపిక చేసుకోవాలని సూచించారు. ఇటీవల నిర్వహించిన సర్వేలో 10వ వార్డులో 75 శాతం మంది సిలివేరు శేఖర్‌కు మద్దతు తెలుపుతున్నారని పేర్కొంటూ, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన కంభంపాటి సతీష్‌తో పాటు పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే వేముల వీరేశం పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పోకల దేవదాస్, మారగోని ఆంజనేయులు, వెంకన్న, రమేష్, కొసనం అశోక్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. #CongressParty #Chityal #MunicipalElections #VemulaVeeresham #IndirammaHouses #PublicWelfare #TelanganaPolitics Follow us on Website Facebook Instagram YouTube