BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 03:20 pm
Posted by : PAGADALA DEVAIAH

ప్రజాస్వామ్య పరిరక్షణకు.. యువత భవిష్యత్తు కోసం ఉద్యమిద్దాం

తెలంగాణ
/ రంగారెడ్డి
Reporter
Pagadala Devaiah Lb Nagar Constituency
25 Nov, 2026 - 03:20 PM
21 వీక్షణలు

డిసెంబర్ 7న ఢిల్లీలో నిర్వహించనున్న ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ పార్లమెంట్ మార్చ్‌ను జయప్రదం చేయాలి

ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాలకృష్ణ, మహమూద్ పిలుపు

హైదరాబాద్, నవంబర్ 25, ఎన్ టుడే న్యూస్: ప్రజాస్వామ్య పరిరక్షణ, యువతకు ఉపాధి, విద్యా హక్కుల సాధన కోసం డిసెంబర్ 7న ఢిల్లీలో నిర్వహించనున్న పార్లమెంట్ మార్చ్‌ను విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి మహమూద్ పిలుపునిచ్చారు.

అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్), అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జాతీయ సమితుల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ పార్లమెంట్ మార్చ్‌కు సంబంధించిన గోడపత్రికను బుధవారం హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్‌లో ఏఐవైఎఫ్ హైదరాబాద్ సమితి ఆధ్వర్యంలో విడుదల చేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ, మహమూద్ మాట్లాడుతూ.. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యకు పరిష్కారంగా భగత్‌సింగ్ నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్ (బనేగా)ను చట్టంగా తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రతి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని, నూతన జాతీయ విద్యావిధానం–2020ను ఉపసంహరించుకుని ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించాలని కోరారు. ప్రతి ఒక్కరికీ ఉచితంగా, సమానమైన నాణ్యమైన విద్య అందించాలని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు డిమాండ్

దేశంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం, రాజ్యాంగ హక్కులను కాపాడటం, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకతను నిర్ధారించడం కోసం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు.

భగత్‌సింగ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ శాస్త్రీయ దృక్పథం, సామాజిక న్యాయం, సమానత్వం ఆధారంగా నూతన భారత నిర్మాణం కోసం యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, యువజనులు ప్రజాస్వామ్యం, విద్య, ఉపాధి హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని అన్నారు.

తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావాలి

డిసెంబర్ 7న ఢిల్లీలో నిర్వహించనున్న పార్లమెంట్ మార్చ్‌లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు, యువజనులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏఐవైఎఫ్ నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ ఆఫీస్ బేరర్లు కళ్యాణ్, అనిల్, సమితి నాయకులు అంజి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.