BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 09:01 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తరిగొప్పులలో విషాదం.. చివరి మజిలీలో ఒంటరైన తల్లి కన్నబిడ్డలున్నా అనాథగా అంతిమయాత్ర..

తెలంగాణ
/ జనగామ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 09:01 AM
32 వీక్షణలు

కడచూపునకూ రాని కొడుకు, ఇద్దరు కుమార్తెలు జనగామ జిల్లా తరిగొప్పులలో హృదయాలను కలచివేసే ఘటన చోటుచేసుకుంది. కడుపున మోసి, ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ పెంచి పెద్ద చేసిన తల్లికి చివరి రోజుల్లో కన్నబిడ్డల ఆదరణ కరవైంది. తల్లి పుష్పనీల మరణించినా కన్నకొడుకు, ఇద్దరు కుమార్తెలు కనీసం కడచూపునకు కూడా రాకపోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో నివసిస్తున్న కొడుకుతో పాటు మరో ఇద్దరు కుమార్తెలు తల్లి మరణవార్త తెలిసినా అంత్యక్రియలకు హాజరుకాలేదని సమాచారం. చివరకు అక్కడికి వచ్చిన ఇద్దరు కుమార్తెలు సైతం తల్లికి తలకొరివి పెట్టేందుకు నిరాకరించినట్లు తెలిసింది. దీంతో జన్మనిచ్చిన తల్లికి చివరి వీడ్కోలు పలికే విషయంలో కుటుంబ సభ్యుల నుంచి ఆదరణ లభించని పరిస్థితి ఏర్పడింది. అయితే కన్నపేగు బంధాలు దూరమైన వేళ గ్రామస్థులు, పంచాయతీ సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. తల్లి పుష్పనీలకు అండగా నిలిచి, సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. కన్నబిడ్డలు చేయాల్సిన చివరి సంస్కారాలను గ్రామస్థులు ముందుకొచ్చి పూర్తి చేయడం అక్కడివారిని కలచివేసింది. ఈ ఘటన కుటుంబ బంధాలు, వృద్ధుల పట్ల బాధ్యత, మానవీయ విలువలపై మరోసారి ఆలోచింపజేస్తోంది.