BREAKING
thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● IDBI బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన thumb ● Valigonda : వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● IDBI బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన thumb ● Valigonda : వలిగొండ ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి
మంచి మాట
Date of Publish : 02 November 2026, 08:08 pm
Posted by : కూనురు మధు

Chityal: దొంగతనం కేసులో ఇద్దరికి రెండేళ్ల జైలు శిక్ష

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
02 Nov, 2026 - 08:08 PM
161 వీక్షణలు

రూ.500 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు

NTODAY NEWS : చిట్యాల

నల్గొండ జిల్లా చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసులో ఇద్దరు నిందితులకు రెండేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ నల్గొండ ప్రిన్సిపల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు ఇచ్చినట్టు  ఈ విషయాన్ని చిట్యాల ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి వెల్లడించారు. చిట్యాల పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 131/2026, సీసీ నంబర్ 667/2026, సెక్షన్ 305(బి) బీఎన్‌ఎస్ కింద నమోదైన కేసులో నీలాపు నీలయ్య (26), బత్తిని నరేష్ అలియాస్ లవ్లీ నరేష్ (29)లను నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో చెర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి నిందితులు ఇద్దరినీ కోర్టుకు హాజరుపరచగా, విచారణ అనంతరం న్యాయమూర్తి వారికి రెండేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.500 జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా 15 రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించారు. ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఎన్. కృష్ణయ్య, దర్యాప్తు అధికారిగా చిట్యాల ఎస్‌ఐ ఎం. రవికుమార్ వ్యవహరించారు. నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నార్కట్‌పల్లి సీఐ ఎస్. సురేష్, చిట్యాల ఎస్‌హెచ్‌ఓ బి. వెంకట్‌రెడ్డి పర్యవేక్షణలో కేసు విచారణ ప్రక్రియ కొనసాగింది. కోర్టు డ్యూటీ అధికారిగా కానిస్టేబుల్ ఎ. ముత్తిలింగం, లైజన్ అధికారులుగా హెడ్ కానిస్టేబుల్ పి. నరేందర్, కానిస్టేబుల్ ఎన్. మల్లికార్జున్ సమన్వయం చేశారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులను ఈ సందర్భంగా ఉన్నతాధికారులు అభినందించారు.