BREAKING
thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు
మంచి మాట
Date of Publish : 02 November 2026, 08:48 pm
Posted by : KOLA MAHESH

Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు

తెలంగాణ
/ మహబూబాబాద్ / మహబూబాబాద్
Reporter
Kola Mahesh Munugodu Constituency
02 Nov, 2026 - 08:48 PM
15 వీక్షణలు

6 లీటర్ల నాటుసారా స్వాధీనం.. ఒక మహిళపై కేసు నమోదు

మహబూబాబాద్, నవంబర్ 2 (ఎన్ టుడే న్యూస్):

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని పలు గ్రామాల్లో అక్రమ నాటుసారా తయారీ, విక్రయాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. సంతులపోడు తండా, కోటగడ్డ, కొత్తపేట గ్రామాల్లో చేపట్టిన తనిఖీల్లో ఒక మహిళ నాటుసారాతో పట్టుబడినట్లు ఎక్సైజ్ సీఐ రాంప్రసాద్ తెలిపారు.

6 లీటర్ల నాటుసారా స్వాధీనం

దాడుల్లో పట్టుబడిన మహిళ వద్ద నుంచి 6 లీటర్ల నాటుసారాను అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అలాగే గతంలో నాటుసారా కేసుల్లో పట్టుబడిన వ్యక్తులను బయ్యారం తహసీల్దార్ నాగరాజు ఎదుట హాజరుపరిచి బైండోవర్ చర్యలు చేపట్టారు.

అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ రాంప్రసాద్ మాట్లాడుతూ.. ఎవరైనా నాటుసారాను తయారు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అక్రమ నాటుసారా కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్‌ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ లలితారాణి, కానిస్టేబుళ్లు హరీశ్, రియాజ్, బలరాం పాల్గొన్నారు.