BREAKING
thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు
మంచి మాట
Date of Publish : 02 November 2026, 09:22 pm
Posted by : KOLA MAHESH

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / నారాయణపూర్
Reporter
Kola Mahesh Munugodu Constituency
02 Nov, 2026 - 09:22 PM
54 వీక్షణలు

నవంబర్ 6 చివరి గడువు.. అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు కావాలి: వంగూరి సత్తయ్య యాదవ్

యాదాద్రి భువనగిరి, నవంబర్ 2 (ఎన్ టుడే న్యూస్):

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియను నాయకులు, కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ జిల్లా నాయకుడు వంగూరి సత్తయ్య యాదవ్ కోరారు. ఓటరు నమోదు చేసుకునేందుకు నవంబర్ 6 చివరి తేదీగా పేర్కొంటూ, అర్హులైన ప్రతి పట్టభద్రుడు నిర్ణీత గడువులోగా ఓటరుగా నమోదు కావాలని పిలుపునిచ్చారు.

గ్రామాలు, మండలాల్లో విస్తృత అవగాహన కల్పించాలి

మునుగోడు నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు ఓటరు నమోదు కార్యక్రమంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, మండలంలో పర్యటిస్తూ అర్హులైన పట్టభద్రులను గుర్తించి, వీలైనంత ఎక్కువ మందిని ఓటర్లుగా నమోదు చేయించేలా సమన్వయంతో పనిచేయాలని కోరారు.

ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకోవాలి

పట్టభద్రులకు తమ ప్రజాస్వామ్య హక్కుపై అవగాహన కల్పించాలని, ఓటరు నమోదు ప్రక్రియలో ఎవరూ వెనుకబడిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సత్తయ్య యాదవ్ సూచించారు.

ఓటరు నమోదు గడువు సమీపిస్తున్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి, అర్హులైన పట్టభద్రులందరూ గడువులోగా దరఖాస్తు చేసుకునేలా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.