BREAKING
thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు thumb ● పూడి, హరిజనవాడలో టీడీపీ అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచారం thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి thumb ● ఫోటోగ్రాఫర్ల కుటుంబాలకు రాష్ట్ర అసోసియేషన్ ఆర్థిక భరోసా thumb ● రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి thumb ● కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు thumb ● Mahabubabad: నాటుసారా వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ దాడులు thumb ● Karimnagar: మానవత్వం మరిచిపోయారా.. రోడ్డుపై ప్రాణాపాయంలో ఉన్నా పట్టించుకోని జనం thumb ● Hyderabad: విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. AI, క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఉచిత శిక్షణ thumb ● Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన thumb ● ఆరుట్లలో వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ నూతన గృహప్రవేశ వేడుకలు
మంచి మాట
Date of Publish : 02 November 2026, 08:52 pm
Posted by : KOLA MAHESH

రామన్న నాయక్‌పై హత్యాయత్నం చేసిన నిందితులను అరెస్ట్ చేయాలి

తెలంగాణ
/ వరంగల్ / వరంగల్
Reporter
Kola Mahesh Munugodu Constituency
02 Nov, 2026 - 08:52 PM
12 వీక్షణలు

పెద్దగూడూరులో ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో 500 మందితో నిరసన ర్యాలీ

నిందితులను అరెస్ట్ చేయకపోతే పోలీస్ స్టేషన్ ముట్టడిస్తాం: గుగులోతు భీమా నాయక్ హెచ్చరిక

నర్సంపేట, నవంబర్ 2 (ఎన్ టుడే న్యూస్):

తెలంగాణ ఉద్యమకారుడు, జర్నలిస్ట్ బానోత్ రామన్న నాయక్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఎల్‌హెచ్‌పీఎస్ (LHPS) ఆధ్వర్యంలో పెద్దగూడూరు మండల కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు 500 మంది పాల్గొని నిందితులను అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు.

నిందితులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?

ఈ సందర్భంగా ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గుగులోతు భీమా నాయక్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న తెలంగాణ ఉద్యమకారుడు, జర్నలిస్ట్ రామన్న నాయక్‌పై హత్యాయత్నం జరిగి రోజులు గడుస్తున్నా నిందితులను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.

జర్నలిస్ట్‌పై, తెలంగాణ ఉద్యమకారుడిపై హత్యాయత్నం జరిగితే పోలీసులు తగిన విధంగా స్పందించకపోవడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే గుర్తించి అరెస్ట్ చేయడంతో పాటు బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

అరెస్ట్ చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను భయభ్రాంతులకు గురిచేసే దాడులను సహించేది లేదని భీమా నాయక్ స్పష్టం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి నిందితులను అరెస్ట్ చేయకపోతే ఎల్‌హెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే పోలీస్ స్టేషన్ ముట్టడి చేపడతామని తెలిపారు.

రామన్న నాయక్‌పై దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని, రౌడీలు, గూండాలను ప్రోత్సహించే వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

పలువురు నాయకుల పాల్గొనడం

ఈ కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బానోతు చందులాల్ నాయక్, ఎల్‌హెచ్‌పీఎస్ పార్లమెంట్ ఇన్‌చార్జి రాందాస్ నాయక్, ఎన్‌టీవీఎస్ జిల్లా అధ్యక్షుడు వీరేష్ నాయక్, డీఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు దేవేందర్, చందా, ఈశ్వర్, మల్లు, చంగ్లాల్, శీను నాయక్, శివవర్మ నాయక్, రాము, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.