BREAKING
thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● దసరా ఉత్సవాల్లో మీడియా పాసుల జాప్యంపై జర్నలిస్టుల నిరసన thumb ● చిత్తూరు వైసీపీ కార్యాలయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు thumb ● నారాయణపురం మండల కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా చిలువేరు శంకర్ ఎన్నిక thumb ● ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కర్నాటి శ్రీహరి thumb ● రామచంద్రపురంలో బతుకమ్మ, దసరా వేడుకల తేదీలు ఖరారు thumb ● 16 ఏళ్లుగా పండుగ కానుకల పంపిణీ.. thumb ● బతుకమ్మ పండుగతో పల్లె పల్లెనా పచ్చదనం thumb ● నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
Date of Publish : 11 October 2026, 02:37 pm
Posted by : SEETHA KIRAN KUMAR

తెలంగాణలో యాసంగి సాగుపై నీలినీడలు..

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
11 Oct, 2026 - 02:37 PM
6 వీక్షణలు

తెలంగాణలో యాసంగి సాగుపై నీలినీడలు.. క్రాప్ హాలిడేపై ప్రభుత్వ యోచన?

ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సాగుపై ప్రత్యేక దృష్టి

హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో యాసంగి సాగుపై ఆందోళనలు పెరుగుతున్నాయి. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతుండటం, రాష్ట్రంలోని పలు మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో యాసంగి సీజన్‌లో పంటల సాగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో క్రాప్ హాలిడే ప్రకటించే అంశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

యాసంగిలో వరి సాగుకు దూరంగా ఉండాలని రైతులకు సూచించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సాగునీరు, తాగునీటి లభ్యత, విద్యుత్ సరఫరా, వర్షాభావ పరిస్థితులపై ప్రభుత్వం సమీక్షించే అవకాశం ఉంది. రైతు వేదికల ద్వారా రైతులతో నేరుగా మాట్లాడి పరిస్థితులను వివరించి, తదుపరి కార్యాచరణ ప్రకటించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

235 మండలాల్లో కరువు పరిస్థితులు?

రాష్ట్రంలోని 235 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు పేర్కొంటున్న నేపథ్యంలో వ్యవసాయ రంగంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే వానాకాలం పంటలు ఎండిపోతున్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. యాసంగి సాగుకు నీటి లభ్యతపై స్పష్టత లేకపోవడంతో రైతులు తదుపరి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.

రైతుల పెట్టుబడులు, ఆదాయ నష్టంపై ఆందోళన

ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటిస్తే రైతులు ఇప్పటికే చేసిన పెట్టుబడులు, సాగు ద్వారా వచ్చే ఆదాయ నష్టాన్ని ఎలా భర్తీ చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తే వాటికి అవసరమైన విత్తనాలు, కనీస మద్దతు ధర, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరోవైపు, ముందస్తు ప్రణాళిక లేకపోవడమే ప్రస్తుత వ్యవసాయ సంక్షోభానికి కారణమని కొందరు విమర్శిస్తున్నారు. అయితే, యాసంగి సీజన్‌లో క్రాప్ హాలిడేపై ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. రైతులకు ఎలాంటి సూచనలు, ప్రత్యామ్నాయాలు అందిస్తారనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.