BREAKING
thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన thumb ● పటాన్‌చెరులో 28 నుంచి ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు thumb ● శాలి లింగోటంలో అంబేద్కర్ నూతన విగ్రహావిష్కరణ thumb ● పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్ thumb ● కదిరిలో వైసీపీ కార్యకర్తలతో పూల శ్రీనివాసరెడ్డి ఆత్మీయ భేటీ thumb ● దిగువ గూటిబైలులో పనతల సురేష్ జన్మదిన వేడుకలు thumb ● భారీ వర్షాలతో అల్లిగూడెం బ్రిడ్జిపై గుంతలు.. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు thumb ● వీఆర్ఎల దీక్షకు ఆర్డిఓ సంఘీభావం thumb ● వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి ఎఫ్ ఏ 2 పరీక్షలకు విద్యార్థులు సన్నద్ధం చేయండి thumb ● ప్రభుత్వం స్పందించేదెప్పుడు?.. భిక్షాటనతో వీఆర్ఎల వినూత్ననిరసన.. thumb ● పిల్లలకు ఆరోగ్యంపై అవగాహన
Date of Publish : 03 August 2026, 08:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. రుణగ్రహీతలకు భారీ ఊరట

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Aug, 2026 - 08:51 PM
48 వీక్షణలు

వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర.. రుణగ్రహీతలకు భారీ ఊరట

హోమ్ లోన్ వడ్డీ 7 శాతానికి తగ్గింపు.. ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలకు గుడ్‌బై.. కారు రుణాలపైనా తక్కువ వడ్డీ

ముంబై, ఆగస్టు 3: సొంత ఇంటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శుభవార్త చెప్పింది. రుణగ్రహీతలకు మరింత ప్రయోజనం కలిగించేలా గృహ రుణాలపై వడ్డీ రేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇప్పటివరకు 7.10 శాతంగా ఉన్న హోమ్ లోన్ వడ్డీ రేటు ఇకపై 7 శాతానికి అందుబాటులోకి రానుంది.

వడ్డీ తగ్గింపుతో పాటు మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. గృహ రుణాలపై ఇప్పటివరకు వసూలు చేస్తున్న ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేసింది. దీంతో కొత్తగా రుణం తీసుకునే వారికి ప్రారంభ వ్యయం గణనీయంగా తగ్గనుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే వారికి ఈ నిర్ణయం మరింత ప్రయోజనకరంగా మారనుంది.

అంతేకాకుండా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఊరటనిచ్చింది. కారు రుణాలపై వడ్డీ రేటును కేవలం 7.45 శాతంగా నిర్ణయించింది. ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో అందుబాటులో ఉన్న అత్యల్ప వడ్డీ రేట్లలో ఇవి ఒకటిగా బ్యాంక్ పేర్కొంది.

వడ్డీ రేట్ల తగ్గింపు, అదనపు ఛార్జీల రద్దుతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నిర్ణయం గృహ, వాహన రుణాలపై ఆసక్తి ఉన్న వినియోగదారులను ఆకర్షించే అవకాశముందని బ్యాంకింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొత్త రుణాల పంపిణీని పెంచడంతో పాటు గృహ నిర్మాణ, ఆటోమొబైల్ రంగాలకు కూడా ఈ నిర్ణయం ఊతమివ్వనుందని భావిస్తున్నారు.