నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వడ్లకొండ రమేష్ యాదవ్ నియామకం
నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మండలంలోని కేతేపల్లి గ్రామానికి చెందిన వడ్లకొండ రమేష్ యాదవ్ నియమితులయ్యారు.మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్ గారి ఆశీస్సులతోపాటు నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మండల నాయకుల సహకారంతో తనకి ఈ బాధ్యత లభించిందని రమేష్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించేందుకు సహకరించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సీనియర్ నాయకులు మండల నాయకులు గ్రామస్థాయి నాయకులు పార్టీ కార్యకర్తలకు పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను నిర్బద్ధతతో నిర్వర్తిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తానని వడ్లకొండ రమేష్ యాదవ్ పేర్కొన్నారు పార్టీ సిద్ధాంతాలు ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాలను విస్తరించేందుకు కృషి చేస్తానన్నారు. నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ అందరినీ కలుపుకునే ముందుకు సాగుతానని తెలిపారు.ప్రజా సమస్యలను పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు తన వంతు కృషి చేస్తానని వెల్లడించారు.పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తానని స్పష్టం చేశారు తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులోనూ పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వడ్లకొండ రమేష్ యాదవ్ తెలిపారు.